19 ఏళ్లలో 13 రెట్లు పెరిగిన ప్రైజ్ మనీ.. సూర్య సేనకు ఎంతొచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

T20 Mens World Cup Final Prize Money History: క్రికెట్ క్రేజ్ పెరుగుతున్న కొద్దీ ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ కూడా భారీగా పెరుగుతోంది. మరి 2028 ప్రపంచకప్ నాటికి ఈ బహుమతి మొత్తం ఎంతకు చేరుతుందో చూడాలి..! ప్రస్తుతం 2026 వరకు ఎంత పెరిగిందో ఓసారి చూద్దాం..

19 ఏళ్లలో 13 రెట్లు పెరిగిన ప్రైజ్ మనీ.. సూర్య సేనకు ఎంతొచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
T20 World Cup 2026

Updated on: Mar 09, 2026 | 8:11 AM

T20 Men’s World Cup Final Prize Money History: 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియాకు విజేతగా రూ. 27.48 కోట్ల భారీ బహుమతి లభించింది. 2007లో ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రైజ్ మనీ ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో ఏడాది వారీగా చూద్దాం:

సంవత్సరం ప్రైజ్ మనీ (₹)
2007 2.02 కోట్లు
2009 3.63 కోట్లు
2010 4.57 కోట్లు
2012 5.34 కోట్లు
2014 6.71 కోట్లు
2016 10.75 కోట్లు
2021 12.00 కోట్లు
2022 13.20 కోట్లు
2024 20.42 కోట్లు
2026 27.48 కోట్లు

2007 – తొలి విజేత భారత్
తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో విజేత జట్టుకు లభించిన ప్రైజ్ మనీ సుమారు రూ. 2.02 కోట్లు.

2009 – పాకిస్థాన్ విజయం
ఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విజేత జట్టుకు సుమారు రూ. 3.63 కోట్లు లభించాయి.

2010 – ఇంగ్లాండ్ బోణీ
ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ తొలిసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి గాను వారికి రూ. 4.57 కోట్లు బహుమతిగా దక్కాయి.

2012 – వెస్టిండీస్ హవా
శ్రీలంకను వారి సొంత గడ్డపైనే 36 పరుగుల తేడాతో ఓడించి వెస్టిండీస్ టైటిల్ గెలిచింది. విజేత జట్టుకు రూ. 5.34 కోట్లు లభించాయి.

2014 – శ్రీలంక గెలుపు
భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక తొలిసారి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఈసారి ప్రైజ్ మనీ రూ. 6.71 కోట్లకు పెరిగింది.

2016 – విండీస్ రెండోసారి
ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో వెస్టిండీస్ విజయం సాధించింది. వీరికి సుమారు రూ. 10.75 కోట్లు అందజేశారు.

2021 – ఆస్ట్రేలియా తొలి టైటిల్
న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. విజేతకు రూ. 12 కోట్లు లభించాయి.

2022 – ఇంగ్లాండ్ రెండో టైటిల్
పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈసారి ప్రైజ్ మనీ రూ. 13.20 కోట్లు.

2024 – భారత్ రెండో టైటిల్
దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. విజేత జట్టుకు సుమారు రూ. 20.42 కోట్లు లభించాయి.

2026 – భారత్ మూడోసారి విశ్వవిజేత
న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి భారత్ మూడోసారి టైటిల్ సాధించింది. ఈ విజయంతో రికార్డు స్థాయిలో రూ. 27.48 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us