T20 World Cup 2021: మరికొద్ది రోజులు పొట్టి ప్రపంచ కప్ సమరానికి తెర లేవనుంది. అయితే అందరి చూపు గ్రూప్ స్టేజ్‌లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉంది. అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు నిన్న బీసీసీఐ, ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టికెట్లు అమ్మకానికి సిద్ధమని ప్రకటించిన వెంటనే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ క్షణాల్లోనే పూర్తవ్వడం చూస్తే.. దాయాదుల పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిపోతుంది.
అయితే, ఈ మధ్యలో పాకిస్తాన్ మాజీలు టీమిండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. మాటలతో దాడి చేస్తూ తమ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్. ఏకంగా టీమిండియా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఈ ప్లేయర్ ప్రశ్నలు సంధించాడు. అలాగే విరాట్ కోహ్లీ బలంపైన కామెంట్లు చేశాడు. ప్రస్తుత భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడేంత బలంగా లేదంటూ మాట్లాడాడు. ఎందుకంటే వారు పాకిస్థాన్ జట్టును ఎదుర్కొనే ధైర్యం లేదా సామర్థ్యం లేదు. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటానికి ఇష్టపడకపోవడానికి ఇదే కారణం అంటూ బాంబ్ పేల్చాడు.
పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఏఆర్‌వై న్యూస్‌తో రజాక్ మాట్లాడాడు. “భారతదేశంలో పాకిస్తాన్ వంటి ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అని ఛానెల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రజాక్ ఇలా అన్నాడు.. “పాకిస్తాన్‌లో అసమాన ప్రతిభ ఉంది. హై ఓల్టేజ్ మ్యాచులను తాకగల సామర్థ్యం పాకిస్తాన్ సొంతం. ఇలాంటి సామర్థ్యం భారత జట్టులో లేదు. టీ20లో పాకిస్తాన్ టీం భారత్‌పై విజయం సాధిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌తో తలపడేంత బలం భారత్ వద్ద లేదు: రజాక్
“భారత జట్టు పాకిస్థాన్‌తో పోటీ పడగలదని నేను అనుకోను. పాకిస్థాన్‌లో ఉన్న ప్రతిభ పూర్తిగా భిన్నమైంది. పాకిస్తాన్ టీంలో ఉన్న ప్రతిభ, టీమిండియాలో లేదు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ భారతదేశం కంటే మెరుగైన ఆటగాళ్లను అందిస్తుంది” అని తెలిపాడు. పాక్‌తో పోల్చితే టీ20ల్లో భారత్ బలంగా లేదు. ఈ ప్రపంచ కప్‌లో పాక్‌దే విజయం సాధిస్తుందని తెలిపాడు.
అక్టోబర్ 24 న విరాట్ తగిన సమాధానం ఇస్తాడు!
దీనిక కౌంటర్‌గా టీమిండియా ఫ్యాన్స్, మాజీలు మాట్లాడారు. ఎవరి సామర్థం ఎంత ఉందో అక్టోబర్ 24 న దుబాయ్ మైదానంలో తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్‌పై భారత్ ఎల్లప్పుడూ ఐసీసీ ఈవెంట్లలో ఆధిపత్యం చూపిస్తుందని, ఈ సారి కూడా అదే జరగనుందని అన్నారు.
IPL 2021: మసకబారుతోన్న ధోని బ్యాట్.. మిస్టర్ కూల్ సరసన దారుణమైన రికార్డు.. అదేంటంటే..!