T20 World Cup, IND vs PAK: టీ20 ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమవుతోంది. దుబయ్‌లో జరగనున్న ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే తాజాగా ఐసీసీ ప్రేక్షకులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వార్త భారతదేశం, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు మాత్రం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. స్టేడియంలో 70 శాతం ప్రేక్షకుల ప్రవేశానికి ఐసీసీ, టోర్నమెంట్ హోస్ట్ బిసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అంటే టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఇకపై నిశ్శబ్దంగా కాకుండా ప్రేక్షకుల సందడితో జరగనున్నాయి. యూఏఈ, ఒమన్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది.
ఐసీసీ నిర్వహించే ఈ మెగా ఈవెంట్‌లో సూపర్ 12 స్టేజ్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 23 న జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోన్న అద్భుతమైన మ్యాచ్ అక్టోబర్ 24 న జరుగుతుంది. ఇందులో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థుల మధ్య భీకర పోరు జరగనుంది. అంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్ దేశాలు ఈ ఐసీసీ ఈవెంట్‌లో తలపడతాయి.
టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టిక్కెట్ల ప్రారంభ ధర ఒమన్‌లో 10 ఒమాని రియల్, యూఏఈలో 30 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఐసీసీ ప్రకారం, టిక్కెట్లను www.t20worldcup.com/tickets నుంచి కొనుగోలు చేయవచ్చు.
ప్రేక్షకుల ప్రవేశంపై జైషా సంతోషం..
టీ 20 వరల్డ్ కప్ కోసం స్టేడియంలో అభిమానుల ప్రవేశానికి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ, “టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ అభిమానుల సమక్షంలో ఆడతారని తెలియజేయడం సంతోషంగా ఉంది.స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించిన యూఏఈ, ఒమన్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమానులు తమ జట్టును ఉత్సాహపరిచేందుకు వస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ప్రేక్షకులతో నిండిన స్టేడియాల్లో ఆడడం వల్ల క్రికెటర్లు మెరుగ్గా రాణించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
The ICC Men’s #T20WorldCup 2021 is fast approaching!
Be a part of the cricketing carnival and #LiveTheGame ??
Ticket booking now OPEN ?️ https://t.co/F78P6m0weU pic.twitter.com/tmjYZbHwMn
— T20 World Cup (@T20WorldCup) October 3, 2021
IPL 2021, KKR vs SRH: నితీష్ రానా దెబ్బకు పగిలిన కెమెరా.. వైరలవుతోన్న వీడియో