IND vs NZ: భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‎కు తీసుకోవాలి.. వీవీఎస్ లక్ష్మణ్..

|

Oct 31, 2021 | 1:13 PM

టీ20 ప్రపంచ కప్ సూపర్ 12లో భాగంగా ఇండియా ఈరోజు న్యూజిలాండ్‎తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‎లో భువనేశ్వర్‎కు బదులు శార్దూల్ ఠాకూర్‎ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు...

IND vs NZ: భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‎కు తీసుకోవాలి.. వీవీఎస్ లక్ష్మణ్..
Bhuvi
Follow us on

టీ20 ప్రపంచ కప్ సూపర్ 12లో భాగంగా ఇండియా ఈరోజు న్యూజిలాండ్‎తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‎లో భువనేశ్వర్‎కు బదులు శార్దూల్ ఠాకూర్‎ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. భువనేశ్వర్‎కు టీ 20 వరల్డ్ కప్ చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ కావచ్చని అభిప్రాయపడ్డాడు. గత రెండు సీజన్‌లలో భువి పేస్ గణనీయంగా పడిపోయిందన్నారు. ఇటీవలి కాలంలో తన పోటీదారు దీపక్ చాహర్‌కి ఎక్కడా పోటీ ఇవ్వడం లేదన్నారు. అయినప్పుటికీ అతడి అనుభవం ఉపయోగపడుతందని భావించారని చెప్పాడు. ఆదివారం దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‎లో విరాట్ కోహ్లీ భువనేశ్వర్ కుమార్‌కు శార్దూల్ ఠాకూర్‌ను తప్పక ఎంపిక చేయాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

ICC పురుషుల T20 వరల్డ్ 2021లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే పోరుకు ముందు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో ప్రత్యేకంగా మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్, నేటి ప్లేయింగ్ XIలో భువనేశ్వర్ కుమార్ కంటే శార్దూల్ ఠాకూర్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై మాట్లాడారు. “నేను శార్దూల్ ఠాకూర్ కోసం ఎంపిక చేస్తాను. ఎందుకంటే శార్దూల్ బ్యాట్‌తో పరుగులు చేయగలడు, వికెట్లు కూడా తీయగలడు. శార్దూల్ తీసుకోవడం వల్ల బ్యాటింగ్ లైనప్‌ బలం పెరుగుతుంది. కాబట్టి, నేను ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ కంటే ముందుగా శార్దూల్‌తో వెళ్తాను. “అతను అనుభవజ్ఞుడైన బౌలర్, కానీ మీరు బ్యాలెన్స్, ప్లేయింగ్ ఎలెవన్ కలయిక గురించి ఆలోచిస్తే, నేను బహుశా భువీ కంటే శార్దూల్‌ను ఇష్టపడతాను” అని లక్ష్మణ్ చెప్పాడు.

ఇప్పటి నుంచి ఇండియాకు ప్రతీ మ్యాచ్‌ కీలకం కానుంది. భారత్ ఈ మ్యాచ్‌తోపాటు అఫ్ఘాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌పై గెలిస్తే సెమీస్‎కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ ఆడిన తీరు అభిమానులు నిరాశపరిచింది. పాక్‎తో మ్యాచ్‎లో బౌలర్లు ఒక్క వికెట్ తీయకపోవడం ఆందోళన కలిస్తున్న విషయం. ఇదే పిచ్‎పై పాకిస్తాన్ బౌలర్ల అలవోకగా వికెట్లు తీశారు. ఇప్పుడు న్యూజిలాండ్‎పై తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చకుంటే ఇండియాకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి.

Read Also.. Ind Vs Pak: బాబర్ మ్యాచ్ ఆడుతుంటే.. అతడి తల్లి వెంటిలేటర్‎పై ఉంది.. అసలు ఏం జరిగిందంటే..