
India vs New Zealand Playing XI: టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ భారత జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ తమ ప్లేయింగ్ XIలో గణనీయమైన మార్పు చేసింది. తమ బిగ్ మ్యాచ్ విన్నర్ మెక్‌కాంచీని తొలగించి జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నారు. భారత జట్టు తమ ప్లేయింగ్ XIలో ఎటువంటి మార్పులు చేయలేదు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్, జాకబ్ డఫ్ఫీ.