T20 World Cup: టీమిండియా సెమీస్ చేరాలంటే.. సూపర్-8లో ఆ ఒక్క ‘గండం’ దాటాల్సిందే..

టీ20 ప్రపంచ కప్‌.. ఇప్పటి వరకు 20 టీమ్‌లు లీగ్‌ స్టేజ్‌లో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల్లోనూ టాప్ బ్యాటర్లకు చెమటలు పట్టాయి. ఇక నుంచి ఎనిమిది జట్లతో కూడిన ‘సూపర్-8’ సమరం మొదలు కానుంది. టీమ్‌ఇండియా పోరాటం గురువారం నుంచి ప్రారంభమవుతుంది.

T20 World Cup: టీమిండియా సెమీస్ చేరాలంటే.. సూపర్-8లో ఆ ఒక్క ‘గండం’ దాటాల్సిందే..
Team India

Updated on: Jun 18, 2024 | 1:08 PM

టీ20 ప్రపంచ కప్‌.. ఇప్పటి వరకు 20 టీమ్‌లు లీగ్‌ స్టేజ్‌లో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల్లోనూ టాప్ బ్యాటర్లకు చెమటలు పట్టాయి. ఇక నుంచి ఎనిమిది జట్లతో కూడిన ‘సూపర్-8’ సమరం మొదలు కానుంది. టీమ్‌ఇండియా పోరాటం గురువారం నుంచి ప్రారంభమవుతుంది. సంచలనాలకు మారుపేరు అఫ్గానిస్థాన్‌. అందుకు ఉదాహరణ లీగ్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగుల తేడాతో విజయం సాధించడం. టీ20 క్రికెట్‌లో ఇదొక భారీ గెలుపు. ఇలాంటి జట్టుతో భారత్‌ జూన్ 20న బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

ఇది చదవండి: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే

గ్రూప్-D నుంచి రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు లీగ్‌ స్టేజ్‌లో దక్షిణాఫ్రికా చేతిలోనే ఓటమిపాలైంది. శ్రీలంక, నెదర్లాండ్స్‌, నేపాల్‌ను ఓడించి సూపర్‌-8కి అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌తో సూపర్‌-8లో భారత్ జూన్ 22న ఆంటిగ్వా వేదికగా ఆడనుంది. గ్రూప్‌-Bలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకొనేందుకు దూసుకొచ్చింది. లీగ్‌ స్టేజ్‌లో కఠినమైన ప్రత్యర్థిగా భావించిన ఇంగ్లాండ్‌పైనా ఘనవిజయం సాధించింది. ఆసీస్‌తో భారత్ జూన్ 24న సెయింట్‌ లూసియా వేదికగా తలపడనుంది.

ఇది చదవండి: అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు.. కనిపెడితే ఖిలాడీవి నువ్వే

సూపర్‌-8లో భారత్‌ ప్రత్యర్థులు అఫ్గాన్‌, బంగ్లా, ఆసీస్‌. మూడు మ్యాచుల్లోనూ భారత్‌ గెలిస్తే.. సెమీస్‌కు చేరుకొనేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే మాత్రం నెట్‌రన్‌రేట్‌ కీలకం అవుతుంది. భారత్‌కు అఫ్గాన్, బంగ్లా నుంచి ప్రతిఘటన ఎదురైనా.. విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. మొదటి రెండు మ్యాచ్‌లు ఇవే జట్లతో ఉండటం కూడా మనకు కలిసొచ్చే అంశమే. ఈ గ్రూప్‌లో మనకు కఠిన ప్రత్యర్థి ఆసీస్‌. ఒకవేళ తొలి రెండు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా.. మనకు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లా మారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వరుస విజయాలను ఖాతాలో వేసుకోవాల్సిందే.

ఇది చదవండి: పేరుకేమో సూపర్‌స్టార్.. ఒక్క పరుగు చేయలేదు.. ఒక్క వికెట్ తీయలేదు.. టీమిండియాకి పట్టిన శని అతడే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us