England: 19 బంతుల్లోనే ఛేజింగ్.. టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. సూపర్ 8 ఆశలు సజీవం..

England Vs Oman Highlights: టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ భీకర దాడికి ఒమన్‌ తడబడింది. ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా, మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీశారు. ఒమన్ 13.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. లక్ష్యాన్ని కేవలం 19 బంతుల్లోనే చేరుకుంది.

England: 19 బంతుల్లోనే ఛేజింగ్.. టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. సూపర్ 8 ఆశలు సజీవం..
England Vs Oman

Updated on: Jun 14, 2024 | 12:45 PM

England vs Oman Highlights: వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దవడంతో ఇంగ్లండ్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై ఘోర పరాజయం పాలవ్వడంతో సూపర్ 8 చేరడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, జూన్ 13న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పుంజుకుంది. ఒమన్ ఇచ్చిన 47 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19 బంతుల్లోనే ఛేదించింది. దీంతో రన్ రేట్ పెరిగింది. ప్రస్తుతం, ఇంగ్లండ్ +3.081 రన్ రేట్‌తో సూపర్ 8కి వెళ్లాలనే కలను సజీవంగా ఉంచుకుంటుంది.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ భీకర దాడికి ఒమన్‌ తడబడింది. ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా, మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీశారు. ఒమన్ 13.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. లక్ష్యాన్ని కేవలం 19 బంతుల్లోనే చేరుకుంది.

గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు బలమైన జట్లుగా బరిలోకి దిగాయి. అయితే స్కాట్లాండ్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో నిలవడంతో.. సూపర్ 8 చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది. స్కాట్లాండ్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఇది స్కాట్లాండ్‌కు వరంగా మారింది.

పట్టికలో స్కాట్లాండ్ 5 పాయింట్లతో (+2.164) రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 3 పాయింట్లతో (+3.081) మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓడి, ఆ తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తేనే ఇంగ్లీష్ జట్టు సూపర్‌కు అర్హత సాధిస్తుంది. అందుకే గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ తేడాతో గెలవాల్సి ఉంది. దీంతో పరిస్థితులను అనుకూలంగా మల్చుకున్న ఇంగ్లండ్.. కేవలం 19 బంతుల్లోనే టార్గెట్‌ను చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..