టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆదివారం తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం తొలిసారి కెప్టెన్లుగా తలపడనున్నారు. పాకిస్తాన్‌పై తన అధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుండగా.. ఎలాగైనా గెలవాలని పాక్ పట్టుదలతో ఉంది. ఇండియా, పాక్ మ్యాచ్‌పై ఇరుదేశాల మాజీ ఆటగాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ పాకిస్తాన్, భారత్ మ్యాచ్‌పై స్పందించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ భారత్‌కు, మహ్మద్ రిజ్వాన్ పాక్‌కు “మ్యాచ్ విన్నర్లు” కాగలరని అన్నారు.
“విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఇరుజట్లకు ముఖ్యమని యూనిస్ యూట్యూబ్ ఛానెల్‌లో” అన్నారు. ఇరువైపుల పేస్ సమానంగా ఉందన్నారు. జస్ప్రిత్ బుమ్రా ‘మెన్ ఇన్ గ్రీన్’ కి కీలక ముప్పు అని పేర్కొన్నారు. “పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు మంచి స్థితిలో ఉన్నారు. ఇండియా పేస్ విభాగం ఇటివల కాలంలో కూడా గణనీయంగా మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బుమ్రా గత కొన్ని నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. కోహ్లీ, బాబర్‌కు పోలికే లేదన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఇంకా ప్రారంభించలేదు. బాబర్ ఇంకా చిన్నవాడని అభిప్రాయపడ్డాడు. “కోహ్లీ 2008 లో నేను ఆడుతున్నప్పుడు అరంగేట్రం చేశాడు” అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అన్నాడు. రోహిత్ శర్మ, బుమ్రాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
ఇదే మ్యాచ్‌పై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించారు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. టీ20 ఫార్మట్‌లో పాక్ రాణించే అవకాశం ఉందన్నారు. టీం ఇండియా ప్రస్తుత ఫామ్ పరిగణలోకి తీసుకుంటే పాకిస్తాన్ ఇండియాకు సవాల్ విసురుతుందని నేను అనుకోను” అని మాజీ బౌలర్ అజిత్ అగర్కర్ అన్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్‌ను తేలికగా తీసుకొవద్దని చెప్పారు. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏదైనా జరగొచ్చని తెలిపాడు.
Read Also.. IND Vs PAK: పాకిస్తాన్‌పై విధ్వంసం సృష్టించే బెస్ట్ ప్లేయింగ్ XI ఇదే.. ఆ దిగ్గజ ప్లేయర్‌కు దక్కని చోటు.!