T20 World Cup 2021, IND vs SCO: టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడం ద్వారా తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. అయితే సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి మిగిలిన రెండు మ్యాచ్‌లలో పెద్ద విజయం సాధించాల్సి ఉంది. శుక్రవారం, టీమిండియా స్కాట్లాండ్‌తో తలపడనుంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడానికి కఠినమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సాధారణంగా కెప్టెన్లు విన్నింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయడానికి ఇష్టపడరు. కానీ, విరాట్ కోహ్లీ అలా చేయగలడనడంలో సందేహం లేదు.
స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పెనుమార్పు చేయగలదు. ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ XI నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో అదనపు స్పిన్నర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.
శార్దూల్ ఠాకూర్ ఖరీదైన బౌలర్..
భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు టీమ్ ఇండియాలో అవకాశం ఇచ్చారు. అయితే అతను రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌పై, 9 బంతుల్లో 17 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్‌పై ఈ బౌలర్ 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదేశారు. ఆఫ్ఘనిస్తాన్‌పై శార్దూల్ ఠాకూర్ ఖరీదైన బౌలర్‌గా మారాడు. శార్దూల్ పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే, టీమ్ ఇండియా గెలుపు మార్జిన్ పెద్దదిగా ఉండేది. పాయింట్ల పట్టికలో మెరుగైన నెట్ రన్ రేట్‌ను సాధించగలిగేది.
ప్లేయింగ్ XIలో శార్దూల్ స్థానంలో ఎవరు?
శార్దూల్ ఠాకూర్ స్థానంలో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో అదనపు స్పిన్నర్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ చాహర్‌కు తొలిసారి అవకాశం రావొచ్చని భావిస్తున్నారు. చాహర్ గూగ్లీ, ఫ్లిప్పర్‌లతో స్కాటిష్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టవచ్చు. బహుశా టీమ్ ఇండియా మరోసారి భువనేశ్వర్ కుమార్ వైపు చూస్తుందని అంటున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయడం, అశ్విన్ రాకతో బ్యాటింగ్ డెప్త్ పెరిగినందున రాహుల్ చాహర్‌ను కూడా జట్టులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.
టీమ్ ఇండియా ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.