T20 World Cup 2021, ENG vs BAN: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు సూపర్ 12 మ్యాచ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ (England vs Bangladesh) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఇంగ్లండ్ టీం 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 125 పరుగుల టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.1 ఓవర్లలో విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేందించేందుకు ఓపెనర్లుగా వచ్చిన జేసన్ రాయ్ 61( 38 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో అద్భుమైన అర్థ సెంచరీతో ఇంగ్లండ్ టీంను విజయపథంలో నడిపించాడు. జాస్ బట్లర్ 18, మలాన్ 28 నాటౌట్, జానీ బెయిర్ స్టో 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరఫున టిమల్ మిల్స్ మూడు వికెట్లు తీయగా, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ రెండు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్‌లో ముష్ఫికర్ రహీమ్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మహ్మదుల్లా 19, నసుమ్ అహ్మద్ 19 నాటౌట్‌గా నిలిచారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లితన్ దాస్(9), మొహ్మద్ నయీం(5) నిరాశపరిచారు. వెంటవెంటనే ఇద్దరూ తమ వికెట్లను కోల్పోయారు. మొయిన్ అలీ బౌలింగ్్లో 3వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన షకీబుల్ హసన్ (4) మరోసారి బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. ఫాంలో ఉన్న రహీం 27(27 బంతులు, 3 ఫోర్లు) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి మహ్మదుల్లా 12 (11 బంతులు, 1 ఫోర్), అసిఫ్ సున్నా పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 2, వోక్స్ 1, లివింగ్ స్టోన్ 1 వికెట్ పడగొట్టారు.
డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి ఇంగ్లండ్ టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది. మరోవైపు బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంక చేతిలో ఓడిపోయాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్‌లో ఇరు జట్లు ఎప్పుడూ తలపడలేదు.
ప్లేయింగ్ ఎలెవన్:
ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్(కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (కెప్టెన్), మహేదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుమ్ అహ్మద్
Another day, another sizzling England performance ✨#T20WorldCup | #ENGvBAN | https://t.co/IFBBKHsBEv pic.twitter.com/7htMmlYUiq
— ICC (@ICC) October 27, 2021
Also Read: 5 వరుస బంతులు.. 5 వికెట్లు.. హ్యాట్రిక్‌తోపాటు ప్రపంచ రికార్డు.. ఈ బౌలర్ దెబ్బకు బ్యాటర్స్ మటాష్