Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్​కు వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో గుడ్ బై

|

Nov 05, 2021 | 7:49 AM

వెస్టిండీస్ స్టార్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​ టోర్నీ అనంతరం ఆట‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు ప్రకటించాడు.

Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్​కు వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో గుడ్ బై
Dwayne Bravo
Follow us on

వెస్టిండీస్ స్టార్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​ టోర్నీ అనంతరం ఆట‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలుకు సమయం వచ్చేసిందని అత‌ను పేర్కొన్నాడు. 18 ఏళ్లుగా వెస్టిండీస్​ జట్టులో ఆడుతున్నాన‌ని… ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాన‌ని చెప్పాడు. కానీ, కరీబియన్​ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్న‌ట్లు వివ‌రించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గి అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్​ పేరు నిలబెట్టుకున్నామని బ్రావో పేర్కొన్నాడు. రెండు ట్రోఫీలు డారెన్ సామి సార‌థ్యంలో పొందినట్లు గుర్తుచేసుకున్నాడు. గురువారం లంకతో మ్యాచ్​ అనంతరం ఫేస్​బుక్​ లైవ్​లో ఈ కామెంట్స్ చేశాడు బ్రావో.

కాగా, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​లో సెమీస్​కు ఏమాత్రం ఛాన్స్ లేని శ్రీలంక టీమ్.. తన ఆఖరి గ్రూప్​ మ్యాచ్​లో స‌త్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​పై 20 పరుగుల తేడాతో విజ‌యకేత‌నం ఎగ‌ర‌వేసింది. దీంతో విండీస్​ సెమీస్​ ఆశలు కూడా గ‌ల్లంత‌య్యాయి. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ టార్గెట్ ఛేదించడంలో కరీబియన్ బ్యాటర్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 ర‌న్స్ మాత్రమే చేశారు. నికోలస్ పూరన్ (46), హెట్​మెయిర్ (81) రాణించారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నె రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.

Also Read: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి