IND vs NZ: ప్లేస్ మాత్రమే మారింది.. పవర్ కాదు.. బంతి, బ్యాట్‌తోనూ సత్తా చాటిన వెంకటేష్ అయ్యర్.. కివీస్‌ సిరీస్‌కు సిద్ధమంటూ సిగ్నల్

|

Nov 05, 2021 | 2:48 PM

యువరాజ్ సింగ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక యువ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్‌ బంతితో పాటు బ్యాట్‌తోనూ సందడి చేసి న్యూజిలాండ్ సిరీస్‌కు సిద్ధమంటూ సిగ్నల్ ఇచ్చాడు.

IND vs NZ: ప్లేస్ మాత్రమే మారింది.. పవర్ కాదు.. బంతి, బ్యాట్‌తోనూ సత్తా చాటిన వెంకటేష్ అయ్యర్.. కివీస్‌ సిరీస్‌కు సిద్ధమంటూ సిగ్నల్
venkatesh iyyar
Follow us on

Syed Mushtaq Ali Trophy 2021: IPL 2021 రెండవ దశలో వెంకటేష్ అయ్యర్‌కు అవకాశం లభించిన వెంటనే తన మార్క్‌తో టోర్నీలో హైలెట్‌గా నిలిచాడు. ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌కు పోటీలో ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న వెంకటేష్ అయ్యర్.. అటు బ్యాట్, ఇటు బాల్‌తోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలుత బంతితో అలజడి సృష్టించి, ఆ తర్వాత బ్యాట్‌తో రచ్చ రచ్చ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. టోర్నీలో గ్రూప్ డిలో మధ్యప్రదేశ్, రైల్వేస్ మధ్య మ్యాచ్ జరిగింది. అయ్యర్ అద్భుత ఆట కారణంగా మధ్యప్రదేశ్ ఈ మ్యాచ్‌లో మరో 13 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో రైల్వేస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. కానీ, 100 పరుగులు చేయడం కూడా కష్టంగా మారింది. రైల్వేస్ తరఫున యువరాజ్ సింగ్ ఒక్కడే 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇతని పేరుకు మాత్రమే యువరాజ్, అతనికి సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఈ యువరాజ్ కుడి చేతితో సిక్సర్ కింగ్ లా బ్యాటింగ్ చేయడం విశేషం.

తొలి బంతికే అయ్యర్ తిరుగుబాటు..
20 ఓవర్లలో రైల్వేస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. 100 పరుగులలోపే కట్టడిచేయడంలో వెంకటేష్ అయ్యర్ పాత్ర చాలా పెద్దదిగా మారింది. ఇందులో అతనికి ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ మద్దతు లభించింది. రైల్వేస్ 9 వికెట్లలో వెంకటేష్, అవేష్ 5 వికెట్లు పంచుకున్నారు. అవేష్ ఖాన్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వెంకటేష్ అయ్యర్ 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రైల్వేస్ తరఫున శుభమ్ చౌబే ఒక్కడే 20 పరుగుల మార్కును అధిగమించాడు.

బంతి తర్వాత బ్యాట్‌తో వెంకటేష్ అయ్యర్ సందడి చేశాడు. అయితే, బ్యాట్‌తో తుఫాన్‌ సృష్టించి విజయకేతనం ఎగురవేసేలా చేశాడు. పూర్తి బాధ్యతతో పూర్తి చేసిన వెంకటేష్ అయ్యర్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 121 పైగానే ఉంది.

వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన, అజేయ ఇన్నింగ్స్ ప్రభావంతో మధ్యప్రదేశ్ 14వ ఓవర్‌కు ముందే 98 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మధ్యప్రదేశ్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. వెంకటేష్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ పార్థ సాహ్ని 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Also Read: T20 World Cup 2021: కోహ్లీకి వెరీ స్పెషల్ డే కానుందా.. ఆ రెండు కోరికలు నేడు నెరవేరితే భారత సారథి నక్కతోక తొక్కినట్లే..!

ICC T20 World Cup 2021: గోరంత ఆశలో కోహ్లీసేన.. కాలం కలిసి వస్తుందా?.. కప్ పోరులో నిలుస్తుందా?..