ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 ఛాంపియన్‌షిప్ లీగ్‌లో ససెక్స్ జట్టు 324 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. మిడిల్‌సెక్స్ 2వ ఎలెవన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ 2వ ఎలెవన్ తుఫాన్ బ్యాటింగ్ చేసింది. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిన కెప్టెన్ రవి బొపారా.. ఏకంగా 12 భారీ సిక్సర్లు, 14 ఫోర్లు బాదేశాడు.
ఈ తుఫాన్ బ్యాటింగ్ ఫలితంగా బొపారా కేవలం 49 బంతుల్లో 144 పరుగులు చేశాడు. మరోవైపు టామ్ అల్సోప్ 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లు ముగిసే సరికి ససెక్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది.
325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ కేవలం 130 పరుగులకే ఆలౌటైంది. దీంతో ససెక్స్ జట్టు 192 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
A huge score from our 2nd XI against Middlesex 2nd XI this afternoon! ?
Ravi Bopara top scored with 144 including 14 fours and 12 sixes as we hit 324-7 from our 20 overs. ?
Middlesex have just started their chase – head to the website for the live scorecard and clips. ?
— Sussex Cricket (@SussexCCC) May 23, 2023
దీంతో పాటు ఇంగ్లీష్ కౌంటీ టీ20 క్రికెట్‌లో 300+ పరుగులు చేసిన తొలి జట్టుగా ససెక్స్ సెకండ్ ఎలెవన్ నిలిచింది. అలాగే టీ20 క్రికెట్‌లో 300 పరుగులు రావడం కూడా కొత్త ప్రపంచ రికార్డుగా నమోదైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..