Video: ఇదేందిది.. అభిషేక్ శర్మను కావాలనే సూర్యకుమార్ రనౌట్ చేశాడా? వీడియో ఇదిగో..

India vs Bangladesh: ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యాడు. బంగ్లాదేశ్‌పై అతను కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆసక్తికరంగా, సూర్యకుమార్ యాదవ్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మను రనౌట్ చేశాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఇందులో నిజం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

Video: ఇదేందిది.. అభిషేక్ శర్మను కావాలనే సూర్యకుమార్ రనౌట్ చేశాడా? వీడియో ఇదిగో..
Surya Kumar Yadav Abhishek Sharma

Updated on: Sep 25, 2025 | 7:10 AM

Abhishek Sharma Run Out: ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అభిషేక్ శర్మ 75 పరుగులతో భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు కానీ రనౌట్ అయ్యాడు. అతని వికెట్ పడటంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా ట్రోల్ అవుతున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మను కావాలనే రనౌట్ చేశాడని విమర్శలు గుప్పిస్తున్నాడు. అభిషేక్ శర్మ రనౌట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే.

సూర్యకుమార్ యాదవ్ తప్పు చేశాడా ?

12వ ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ పడిపోయింది. ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన మొదటి బంతికి సూర్యకుమార్ యాదవ్ కట్ షాట్ ఆడాడు, కానీ, పాయింట్ వద్ద నిలబడి ఉన్న రిషద్ హుస్సేన్ ఎడమవైపుకు డైవ్ చేసి బంతిని క్యాచ్ చేశాడు. ఇంతలో, నాన్-స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, బంగ్లాదేశ్ ఆటగాడి చేతిలో బంతి ఉందని తెలియక హాఫ్‌వే క్రీజుకు చేరుకున్నాడు. రిషద్ హుస్సేన్ చురుకుదనం ప్రదర్శించి, బంతిని ముస్తాఫిజుర్ రెహమాన్‌కి విసిరాడు. అతను రెప్పపాటులో అభిషేక్ శర్మను రనౌట్ చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ తప్పు చేయలేదు. ఎందుకంటే, రిషద్ హుస్సేన్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసి బంతిని క్యాచ్ చేశాడు. సూర్య తన క్రీజు నుంచి బయటకు కూడా రాలేదు. సూర్య చేసిన తప్పు ఏమిటంటే అదే ఓవర్లో అతను కూడా అవుట్ అయ్యాడు. యాదవ్ 11 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ జాకీర్ అలీకి క్యాచ్ ఇచ్చాడు. ఈ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడం భారత జట్టు భారీ స్కోరు ఆశలకు దెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, టీం ఇండియా 200 పరుగులు సాధించాలని అనుకున్నప్పటికీ, చివరికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్..

ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు పరుగులు కూడా సాధించలేకపోయాడు. ఈ సంవత్సరం, సూర్యకుమార్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 12.42 సగటుతో 87 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 112.98గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఇలాగే ఆడటం కొనసాగిస్తే, అతని కెప్టెన్సీ, జట్టులో స్థానం ప్రమాదంలో పడుతుందని స్పష్టంగా తెలుస్తుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..