శాంసన్, అభిషేక్ కాదు భయ్.. టీమిండియా విక్టరీకి అతనే కారణం..: సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Jasprit Bumrah T20 World Cup 2026 final bowling: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన జట్టు ఆటగాళ్లను ప్రశంసించాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను కొనియాడుతూ అతన్ని “జాతీయ సంపద”గా అభివర్ణించడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

శాంసన్, అభిషేక్ కాదు భయ్.. టీమిండియా విక్టరీకి అతనే కారణం..: సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫైనల్లో విజయంతో, సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20ఐ కెప్టెన్‌గా కూడా నిలిచాడు. ఇప్పుడు అతను అత్యధిక విజయ శాతాన్ని కలిగి ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 52 టీ20ఐ మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతను వీటిలో 42 మ్యాచ్‌లలో గెలిచాడు. 8 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయాడు, రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. అంటే అతని కెప్టెన్సీలో, టీమ్ ఇండియా 80.77% మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇది ప్రపంచంలోని అన్ని కెప్టెన్లలో అత్యధికం.

Updated on: Mar 09, 2026 | 8:23 AM

Suryakumar Yadav calls Bumrah national treasure: సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలోని భారత జట్టు (India national cricket team) టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత జట్టు కెప్టెన్ తన సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ను “జాతీయ సంపద”గా అభివర్ణిస్తూ అతని ప్రతిభను కొనియాడాడు.

బుమ్రా ఒక తరంలోకెల్లా గొప్ప బౌలర్..

ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ ప్రదర్శనతో న్యూజిలాండ్ జట్టు (New Zealand national cricket team) ను 159 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ: “బుమ్రా ఒక తరం లోకెల్లా గొప్ప బౌలర్. అతన్ని నేను జాతీయ సంపదగా పిలవగలను. మ్యాచ్ ఎలా గెలవాలో అతనికి బాగా తెలుసు. ప్రస్తుతం అతనే ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్” అంటూ చెప్పుకొచ్చాడు.

వరుసగా రెండు టైటిల్స్‌తో చరిత్ర సృష్టించిన భారత్..

ఈ విజయం ద్వారా భారత్ వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన తొలి పురుష జట్టుగా నిలిచింది. అలాగే స్వదేశంలోనే ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది.

కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రయాణం..

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ విజయానికి తన జట్టు ఆటగాళ్లే కారణమని తెలిపాడు. తన కెప్టెన్సీకి మద్దతు ఇచ్చిన జైషా (Jay Shah), రోహిత్ శర్మ (Rohit Sharma) లకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.

“2024 వరల్డ్ కప్ తర్వాత నా నాయకత్వ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి జట్టు నాపై నమ్మకం ఉంచింది. ఆ విశ్వాసంతోనే మేం ఇక్కడికి వచ్చి ట్రోఫీ గెలిచాం” అని సూర్య చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us