Suryakumar Yadav: 6 ఫోర్లు, 8 సిక్సులు.. 220 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. ఇదేం కుమ్ముడు బ్రో.. లంక బౌలర్లను కన్నీళ్లు పెట్టించావ్‌గా..

సూర్య కేవలం 26 బంతుల్లో తన 14వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో 220 స్ట్రైక్‌రేట్‌తో సెంచరీ పూర్తి చేశాడు.

Suryakumar Yadav: 6 ఫోర్లు, 8 సిక్సులు.. 220 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. ఇదేం కుమ్ముడు బ్రో.. లంక బౌలర్లను కన్నీళ్లు పెట్టించావ్‌గా..
Ind Vs sl 3rd T20i Suryakumar Yadav

Updated on: Jan 07, 2023 | 9:44 PM

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ 17 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్, అక్షర్ పటేల్ ఉన్నారు. రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.

సూర్య తుఫాన్ సెంచరీ..

రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన భారత్‌ను సూర్య కుమార్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. గిల్‌తో కలిసి 53 బంతుల్లో 111 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం వికెట్లు పడుతున్నా.. తన దూకుడుని మాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలో సూర్య కేవలం 26 బంతుల్లో తన 14వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో 220 స్ట్రైక్‌రేట్‌తో సెంచరీ పూర్తి చేశాడు.