T20 World Cup 2021: క్యాచ్‌ విడిచిపెట్టినా హీరో అయ్యాడు.. ఎందుకంటే..

|

Nov 07, 2021 | 7:51 PM

ఆదివారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. ఒక క్యాచ్ పట్టుకోవడానికి అతను తీవ్ర ప్రయత్నం చేశాడు...

T20 World Cup 2021: క్యాచ్‌ విడిచిపెట్టినా హీరో అయ్యాడు.. ఎందుకంటే..
Michel
Follow us on

ఆదివారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. ఒక క్యాచ్ పట్టుకోవడానికి అతను తీవ్ర ప్రయత్నం చేశాడు. క్యాచ్ పట్టకున్నా సిక్సర్‌ను మాత్రం ఆపాడు. జేమ్స్ నీషమ్ వేసిన 19వ ఓవర్ మొదటి బంతిని రషీద్ ఖాన్ డీప్ మిడ్-వికెట్ మీదుగా సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. బంతి దాదాపు బౌండరి దగ్గర పడే విధంగా వచ్చింది. అక్కడే ఉన్న మిచెల్ క్యాచ్ పట్టుకోవాలని ట్రై చేశాడు. కానీ అది సాధ్యం కాకపోవటంతో బాల్‎ను బయటకు నెట్టాడు. దీంతో ఆఫ్ఘాన్‎కు రెండే పరుగులు వచ్చాయి. అతను క్యాచ్ పట్టుకోకపోయినా అతను చేసిన ప్రయత్నం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

ఈ మ్యాచ్‎లో ఆఫ్ఘానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో మునిగిపోయింది. 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో కేవలం ఇద్దరే రెండెంకల స్కోర్ దాటారు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హజ్రతుల్లా జజాయ్ 2, మహ్మద్ షాజాద్ 4, గుర్బాజ్ 6, గుల్బాదిన్ 15, నబీ 14, కరీం జనత్ 2, రషీద్ ఖాన్ 3 పరుగులకే పరిమితమయ్యారు. ముజీబ్ 0 నాటౌట్‌‌గా నిలిచాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ 2, ట్రెంట్ బౌల్ట్ 3, మిల్నే, నీషమ్, సోధి తలో వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం 18.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుని ఘన విజయం సాధించింది. ఓపెనర్ డారిల్ మిచెల్ 17 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌తో పవర్ ప్లేలోపే పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్‌తో కలిసి మార్టిన్ గప్టిల్ న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చేందుకు సహాయపడ్డాడు. అయితే గప్టిల్ 28 పరుగులకు ఔటయ్యాక, క్రీజులోకి వచ్చిన డేవాన్ కాన్వే(36), విలియమ్సన్(40) మిగతా పని పూర్తి చేశారు.

Read Also… Chris Gayle: నేనింకా రిటైర్మెంట్ ప్రకటించలేదు.. ఎందుకు అలా చేశానంటే..