
అనుకున్నట్టుగానే జరిగింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కూడా తమ కోర్ టీంపై నమ్మకాన్ని ఉంచాయి. ముఖ్యంగా బెంచ్‌కే పరిమితమైన ప్లేయర్స్, నిలకడలేమి ఆటగాళ్లకు గుడ్ బై చెప్పేసి తమ పర్స్‌లను ఖాళీ చేశాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. ట్రావిస్ హెడ్‌ను ముంబై టీంకు ట్రేడ్ చేసి.. రోహిత్ శర్మను తీసుకుంటుందని.. అలాగే హెన్రిచ్ క్లాసెన్‌ను వేలంలోకి వదిలేసి.. మళ్లీ కొనుగోలు చేస్తుందని టాక్ వినిపించింది. అయితే అవన్నింటిని పటాపంచలు చేస్తూ కావ్యపాప.. తన కోర్ టీంపై మళ్లీ భరోసాతో ముందుకు వెళ్తోంది.
రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అథర్వ తైదే, వియాన్ ముల్డర్, మహ్మద్ షమీ(LSGకి ట్రేడ్)
ఇక కోర్ టీం విషయానికొస్తే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కచ్చితంగా మరోసారి ఓపెనింగ్ బ్యాటర్లుగా బరిలోకి దిగనున్నారు. అలాగే మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఉండకనే ఉన్నారు.. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, అనికేట్ వెర్మ దిగనుండగా.. వీరికంటే ముందు మరో ఆల్‌రౌండర్- కమ్ ఫినిషర్ రోల్ కోసం ఓ ప్లేయర్‌ను వేలంలో కొనుగోలు చేయాలని హైదరాబాద్ యాజమాన్యం చూస్తోంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అతడి కోసం కోట్లు అయినా ఖర్చు చేయాలని చెప్పాడట. మరి అతడెవరో కాదు.. కామెరాన్ గ్రీన్.
గాయం నుంచి కోలుకున్న ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్.. అటు వన్డేలు, ఇటు టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. అలాగే మరికొన్ని రోజుల్లో యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుండటంతో.. అందరి ఫోకస్ అతడిపైనే పడింది. అయితే ఇక్కడ హైదరాబాద్‌కు గ్రీన్ కోసం మినీ వేలంలో గట్టి పోటీ అయ్యేలా కనిపిస్తోంది. అటు కేకేఆర్, చెన్నై కూడా ఈ ఆల్‌రౌండర్ కోసం పోటీపడుతున్నాయి. మరి చూడాలి ఎవరికి దక్కుతాడో.?
Variations, smiles and a whole lot of 𝐎𝐑𝐀𝐍𝐆𝐄-𝐋𝐎𝐕𝐄 coming 🔙 again 😍
Jaydev Unadkat | Harshal Patel | #PlayWithFire pic.twitter.com/5vI3EnqIGV
— SunRisers Hyderabad (@SunRisers) November 17, 2025