ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు సర్వం సిద్దమైంది. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టును ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అయితే కొన్ని జట్లు స్టార్ ప్లేయర్స్‌ను వదిలేయడంతో మెగా వేలం రసవత్తరంగా మారనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఈ ఫ్రాంచైజీ తమ కీలక ప్లేయర్స్ అయిన డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌ను విడిచి పెట్టింది. దీనితో వీరిద్దరూ మెగా వేలంలో భారీ ధర పలకనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర వ్యవహరించడమే కాకుండా.. 2016లో ఫ్రాంచైజీకి తొలి ట్రోఫీని అందించిన డేవిడ్ వార్నర్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్‌లో డేవిడ్ వార్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధిగా వ్యవహరించనున్నాడని సమాచారం. ఆర్‌సీబీలో చేరేందుకు వార్నర్ ఆసక్తి చూపిస్తుండటంతో పాటు.. ఫ్రాంచైజీ కూడా అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
కాగా, ఐపీఎల్ 2021 సీజన్ అనంతరం విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీకి వారుసుడిగా నెక్స్ట్ ఆర్సీబీ కెప్టెన్ ఎవరన్న దానిపై సోషల్ మీడియా వేదికగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇక ఐపీఎల్ 2022కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకుంది.
Also Read:
ఈ ఫోటోలో ఎన్ని పక్షులు ఉన్నాయో చెప్పగలరా.? కొంచెం కష్టమే.! కనిపెట్టండి..
ఇదేందిది.! ఈ వ్యక్తి క్రియేటివిటీకి ఇంజినీర్లు సైతం షాకవుతారు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
2022లో ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. పక్కా అదృష్టవంతులు!