India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఓటమి పాలైంది. ఈసారి చరిత్ర సృష్టించాలనే కలతో టీమిండియా దక్షిణాఫ్రికా చేరుకున్నప్పటికీ తొలి మ్యాచ్‌లోనే ఆ కల చెదిరిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత, టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లో నిరంతర ఫ్లాప్ అని నిరూపించుకున్నందున చాలా విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడు టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. టీ20, టెస్ట్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలంటూ అతనికి సూచించాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో చాలా దూకుడుగా ఆడుతున్నాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి, మీరు T-20 లేదా టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు చాలా తేడా ఉంటుందని అతను అర్థం చేసుకోవాలని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
తెల్ల బంతి కంటే ఎర్రటి బంతి ఎక్కువగా కదులుతుందని సునీల్ గవాస్కర్ తెలిపాడు. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలని,. శుభ్‌మన్ గిల్ కెరీర్ ప్రారంభించినప్పుడు మెరుగ్గా ఆడుతున్నాడని, అందుకే అతడిపై ప్రశంసలు వచ్చాయని మాజీ కెప్టెన్ ప్రకటించాడు.
శుభ్‌మన్ గిల్ వీలైనంత త్వరగా మంచి ఫామ్‌లోకి వస్తాడని మేం ఆశిస్తున్నామని, అతని భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలంటే అతను మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్‌లో చాలా ముఖ్యమైన స్థానం అయిన మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నందున శుభ్‌మాన్ గిల్ ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
శుభ్‌మన్ గిల్ చాలా కాలంగా టెస్టుల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడలేదు. అతను తన కెరీర్‌లో 19 టెస్టులు ఆడాడు. కానీ, ఇంకా 1000 పరుగులు పూర్తి చేయలేదు. అతని యావరేజ్ కూడా చాలా తక్కువ అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే, ఒకవైపు వన్డేల్లో 60కిపైగా సగటుతో పరుగులు చేస్తున్న గిల్.. టెస్టుల్లో మాత్రం విఫలమవుతున్నాడు. అందుకే, అతడిని టెస్టు జట్టు నుంచి తప్పించాలనే చర్చలు కూడా జరుగుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..