దశాబ్ధాలు కాదు.. శతాబ్ధం.. ఏకంగా 110 ఏళ్లనాటి రికార్డులకు బ్రేక్.. శార్దూల్‌, సుందర్‌ జోడీ అదుర్స్ ..

|

Jan 18, 2021 | 11:33 PM

దశాబ్ధాలు కాదు..శతాబ్ధం. ఏకంగా 110 ఏళ్ల రికార్డ్‌ బద్దలైంది. బ్రిస్బేన్‌ నాలుగో టెస్ట్‌లో ఈ అద్భుత రికార్డ్‌ సృష్టించింది ఏ సీనియర్‌ ఆటగాడో కాదు. ఫస్ట్‌ టెస్ట్‌ ఆడుతున్న టీమిండియా కుర్రోడు.

దశాబ్ధాలు కాదు.. శతాబ్ధం.. ఏకంగా 110 ఏళ్లనాటి రికార్డులకు బ్రేక్.. శార్దూల్‌, సుందర్‌ జోడీ అదుర్స్  ..
Follow us on

Sundar and Shardul Break : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బాల్‌ బౌండరీ దాటిందా లేదా.. ఈ డైలాగ్‌ కరెక్ట్‌గా సూటవుతుంది ఆ యంగ్‌ ఇండియన్‌ క్రికెటర్‌కి. ఎందుకంటే.. ఆడిన ఫస్ట్‌ టెస్ట్‌లోనే రికార్డులను వాషింగ్టన్‌ సుందర్ తిరగరాసేశాడు‌. ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించాడు. మహామహుల కాంప్లిమెంట్‌ అందుకున్నాడు.

ఎప్పుడో 110 ఏళ్లనాటి పాత రికార్డును…

ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా క్రీజ్‌లోకొచ్చిన వాషింగ్టన్ సుందర్‌మీద ఎవరికీ ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. కాసేపు క్రీజ్‌లో స్టాండ్‌ అయితే చాలనుకున్నారు. కానీ మామూలుగా ఆడితే మజా ఏముందునుకున్నాడో.. ఎప్పుడొస్తేనేం ప్రూవ్‌ చేసుకోవడానికనుకున్నాడోగానీ..  ఎప్పుడో 110 ఏళ్లనాటి పాత రికార్డును వాషింగ్టన్‌ సుందర్ దుమ్ము దులిపేశాడు‌.
ఆసీస్‌ మీద వాషింగ్టన్‌ సుందర్‌ చేసిన 62 పరుగులు ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త రికార్డ్‌ సృష్టించాయి.

1911లోని ఇంగ్లండ్‌ రికార్డును..

1911లో ఇంగ్లండ్‌ తరపున అరంగేట్రం చేసిన ఫ్రాంక్‌ పోస్టర్‌ 56 రన్స్‌ రికార్డ్‌ని సుందర్ అధిగమించాడు‌. అంతేకాదు.. భారత్‌నుంచి అరంగేట్రం చేసి ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మెన్‌ చేసిన మూడో టాప్‌ స్కోర్‌ కూడా ఇదే. ఇక తొలి టెస్ట్‌లోనే మూడు వికెట్లతో పాటుటు హాఫ్ సెంచ‌రీ చేసిన మూడో ఇండియ‌న్‌గా సుంద‌ర్ మరో రికార్డ్‌ నమోదుచేశాడు. సుందర్‌ కంటే  ముందు ద‌త్తు ఫాడ్కర్‌, హ‌నుమ విహారి ఈ ఘ‌న‌త సాధించారు.

అద్భుతమైన జోడీ..

బ్రిస్బేన్‌టెస్ట్‌లో శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ల అసాధారణ బ్యాటింగ్‌తో మూడో టెస్టులో భారత జట్టు పోరాటపటిమ ప్రదర్శించింది. అత్యుత్తమ బౌలర్లున్నా.. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో భారత్‌ను ఆదుకున్నారు శార్దూల్‌, సుందర్‌. తర్వాత సుందర్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడంతో 27 పరుగుల తేడాతో భారత్‌ చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.

30 ఏళ్ల క్రితంనాటి రికార్డు..

30 ఏళ్ల క్రితం కపిల్‌ దేవ్‌, మనోజ్‌ ప్రభాకర్‌ ఏడో వికెట్‌కు నమోదు చేసిన 58 పరుగుల రికార్డు శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జోడీ దూకుడుతో గల్లంతైంది. మరోవైపు.. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి.. అరుదైన క్లబ్‌లో చేరాడు హైద‌రాబాదీ పేస్ బౌల‌ర్ మ‌హమ్మద్‌ సిరాజ్. తొలి టెస్ట్ సిరీస్‌లోనే ఐదు వికెట్ల ఘ‌న‌త ఒక విశేష‌మైతే.. గ‌బ్బా స్టేడియంలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో ఇండియ‌న్ బౌల‌ర్‌గా నిలిచాడు సిరాజ్.