Broad vs Warner: ఇంగ్లాండ్ వేదికగా ఇంగ్లీష్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ మూడో మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మరోసారి ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ని ఔట్ చేశాడు. మొత్తంగా టెస్టుల్లో వీరిద్దరు 51 సార్లు తలపడిన వార్నర్ వికెట్‌ని బ్రాడ్ 17 సార్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిని ఎక్కువసార్లు ఔట్ చేసిన 3వ ఆటగాడిగా స్టువర్ట్ బ్రాడ్.. వెస్టిండీస్ బౌలర్లు అయిన కర్ట్లీ అంబ్రూస్(మైకేల్ అతెర్టన్‌ని 17 సార్లు), కర్ట్నీ వాల్ష్(మైకేల్ అతెర్టన్‌ని 17 సార్లు) పేరున ఉన్న రికార్డును సమం చేశాడు.
అయితే జూలై 7న ప్రారంభమైన మూడో టెస్ట్ తొలి రోజునే డేవిడ్ వార్నర్‌ని స్టువర్ట్ బ్రాడ్ వికెట్ తీశాడు. ఇలా బ్రాడ్ అనేక సార్లు వార్నర్ వికెట్ పడగొట్టడంతో అతని తండ్రి క్రిస్ బ్రాడ్(ఐసీసీ మ్యాచ్ రిఫరీ) కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘స్టువర్ట్ బ్రాడ్ నన్ను మళ్లీ ఐట్ చేశాడు’ అని వార్నర్ బోర్డ్‌పై రాస్తున్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. దీంతో వార్నర్ మామ అభిమానులకు స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలోనే క్రిస్ బ్రాడ్‌ని వార్నర్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ‘ఐసీసీ రిఫరీ స్థానంలో ఉన్న వ్యక్తికి ఇది తగని పని’., ‘మీ అబ్బాయిని 2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ సిక్సర్లతో ఉతికేసినప్పుడు నిద్రపోయారా..?’ అంటూ పలు రకాలుగా వార్నర్ అభిమానులు రాసుకొస్తున్నారు.
ఇదిలా ఉండగా ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ ప్రకారం, క్రిస్ బ్రాడ్ చేసిన పోస్ట్‌పై ICC అధికారికంగా పరిగణనలోకి తీసుకోనప్పటికీ, అతన్ని అంతర్గతంగా మందలించింది. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడో మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 6 సార్లూ ఔట్ అయ్యాడు. ఇందులో 3 సార్లు వార్నర్‌ని స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేయడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..