INDIA VS ENGLAND: భారత పర్యటనలో భాగంగా చెన్నైలో ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ పట్టు బిగించినట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన తర్వాత ఇండియన్ బౌలర్ షాబాజ్ నదీమ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. నెట్స్‌లో సాధన చేసి తప్పులు దిద్దుకుంటానని వెల్లడించాడు. 44 ఓవర్లు వేసిన ఈ దేశవాళీ దిగ్గజం 167 పరుగులిచ్చి స్టోక్స్ (82), జో రూట్ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
‘ఆఫ్‌సైడ్ ఆఫస్టంప్ వైపున్న గరుకు ప్రాంతాల్లో బంతులు వేసేందుకు ప్రయత్నించాను. స్టోక్స్ రివర్స్ స్వీప్‌తో ఎదురుదాడి చేయడంతో లైన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టంప్స్‌కు విసురుతూ అతడిని ఔట్ చేశా’ అని నదీమ్ అన్నాడు. మ్యాచులో ఇప్పటి వరకు అతడు ఆరు నోబాల్స్ విసిరాడు. దాంతో బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. ‘రూట్ గొప్ప ఆటగాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంతిని చక్కగా స్వీప్ చేస్తున్నాడు. బంతులు ఎక్కడ వేయాలన్న దాన్ని మరింత బాగా కసరత్తు చేయాలి. బ్యాట్స్‌మన్ స్వీప్ చేశాడంటే బౌలర్లకు కష్టాలు తప్పవు. కానీ అతడు పొరపాటు చేసేవరకు ఎదురుచూడక తప్పదు.