Steve Smith: స్టీవ్ స్మిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..

Steve Smith: స్టీవ్ స్మిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని అందుకే వరుసగా విఫలమవుతున్నాడని అంటున్నాడు

Steve Smith: స్టీవ్ స్మిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..

Updated on: Jan 01, 2021 | 12:45 PM

Steve Smith: స్టీవ్ స్మిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని అందుకే వరుసగా విఫలమవుతున్నాడని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ సారథి కిమ్‌ హ్యూస్‌. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో స్టీవ్‌స్మిత్‌ వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు మొత్తంగా 10 పరుగులు సైతం చేయలేదు.

ఈ సందర్భంగా కిమ్‌ హ్యూస్‌ ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. స్టీవ్‌స్మిత్ ప్రపంచస్థాయి ఆటగాడని అందులో ఎటువంటి మార్పులేదని అన్నాడు. కానీ టీమ్‌ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీసులో మాత్రం అలా కనిపించడం లేదని పేర్కొన్నాడు. నాలుగు నెలలుగా అతడు తన సతీమణికి దూరంగా ఉండటం వల్ల మానసికకంగా ఇబ్బందిపడుతున్నాడని వెల్లడించాడు. మూడో టెస్టులోనైనా బాగా ఆడాలని కోరాడు. మెల్‌బోర్న్ టెస్ట్ గురించి మాట్లాడుతూ..ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సిరీసులో 2-0తో ఉండే సువర్ణావకాశం చేజారిందని బాధపడ్డారు. భారత జట్టు కెప్టెన్ అజింక్య రహానె జట్టును ముందుండి నడిపించాడని ప్రశంసించారు.