ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో స్టీవ్ స్మిత్ ఒకడిగా పేరుగాంచాడు. దేశవాళీ టీ20 లీగ్ బిగ్ బాష్‌లో ఈ ప్లేయర్ అత్యుత్తమ ఆటతీరుతో సందడి చేస్తున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి, నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాడు. ఒక్క బంతికి 16 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ బ్యాట్.. రెండు వరుస సెంచరీల తర్వాత, తాజాగా 66 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్ 109.33 సగటు, 180.22 స్ట్రైక్ రేట్‌తో 328 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 24 సిక్సర్లు, 18 ఫోర్లు వచ్చాయి.
బిగ్ బాష్ లీగ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో, స్టీవ్ స్మిత్ టెస్టులు, వన్డేలతో పాటు, టీ20లలో కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని నిరూపించాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ ఈ హాఫ్ సెంచరీకి ముందు వరుసగా రెండు సెంచరీలు బాదేశాడు.
15 runs off one legal delivery! ??
Steve Smith’s cashing in once again in Hobart ?#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7
— KFC Big Bash League (@BBL) January 23, 2023
ON THE ROOF.
Steve Smith ? #BBL12 pic.twitter.com/XLxROgo7hW
— 7Cricket (@7Cricket) January 23, 2023
స్టీవ్ స్మిత్ ఐపీఎల్ వేలంలో కొనుగోలుదారుని పొందలేదు. అతను చివరిసారిగా IPL 2021లోనే ఈ లీగ్‌లో భాగమయ్యాడు. అయితే, ఇప్పుడు బిగ్ బాష్ లీగ్‌లో అతని తుఫాన్ బ్యాటింగ్ చూస్తుంటే ఐపీఎల్‌లో అతడిని కొనకుండా జట్లు తప్పు చేశాయని భావిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..