IPL 2026 KKR : కెమెరామెన్ ఫోకస్ అంతా షారుఖ్ మీదే.. కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు

IPL 2026 KKR : పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ వరుస వికెట్లు కోల్పోవడంతో ఓనర్ షారుఖ్ ఖాన్, సీఈఓ వెంకీ మైసూర్‌తో సీరియస్‌గా చర్చించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 25 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.

IPL 2026 KKR : కెమెరామెన్ ఫోకస్ అంతా షారుఖ్ మీదే.. కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
Kkr Sharukh Khan

Updated on: Apr 07, 2026 | 11:42 AM

IPL 2026 KKR : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కో-ఓనర్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన టీమ్ ప్రదర్శనపై కాస్త సీరియస్‌గా ఉన్నట్లు కనిపించారు. మ్యాచ్ ప్రారంభంలోనే కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోవడం, అదే సమయంలో వర్షం పడటంతో షారుఖ్ స్టేడియంలోనే కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్‌తో సుదీర్ఘంగా, చాలా తీవ్రంగా చర్చిస్తూ కనిపించారు. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభం అస్సలు బాలేదు. జేవియర్ బార్ట్లెట్ వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), వన్ డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (4) పెవిలియన్ చేరారు. కేవలం 25 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో కెమెరా కళ్లు షారుఖ్ ఖాన్ వైపు వెళ్లాయి. షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి మ్యాచ్ చూడటానికి వచ్చారు. కానీ జట్టు పరిస్థితి చూసి ఆయన ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది.

వర్షం కారణంగా ఆట ఆగిపోయినప్పుడు, షారుఖ్ ఖాన్ కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్‌తో చాలా సేపు ఏదో సీరియస్‌గా చర్చిస్తూ కనిపించారు. కామెంటేటర్లు కూడా బాద్‌షా చాలా ఇంటెన్స్ చాట్‌లో ఉన్నారు అని పేర్కొన్నారు. కేకేఆర్ వరుస ఓటములు, ఆటగాళ్ల గాయాలు, కెప్టెన్సీ మార్పుల నేపథ్యంలో షారుఖ్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అజింక్యా రహానే కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కీలక మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా దూరం కాగా, సునీల్ నరైన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో లేరు. వారి స్థానంలో రోవ్‌మన్ పావెల్, నవదీప్ సైనీ జట్టులోకి వచ్చారు. జట్టులో నిలకడ లేకపోవడం, కీలక ఆటగాళ్లు గాయపడటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. పాయింట్ల పట్టికలో కింద ఉన్న కేకేఆర్, మళ్ళీ ఫామ్‌లోకి రావాలంటే షారుఖ్ మంత్రం ఏదైనా పనిచేస్తుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us