SL vs IND: సిరీస్‌ మొత్తం బద్దకస్తుడిలానే.. టీమిండియా మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

Krishnamachari Srikkanth Comments on India vs Sri Lanka 2nd Test: తొలి టెస్టులో విజయం సాధించిన భారత్‌.. రెండో టెస్టులోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. శ్రీకాంత్‌ అంచనా వేసినట్లుగానే టీమ్‌ఇండియా శ్రీలంకపై సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా అనేది ఇప్పుడు చూడాలి.

SL vs IND: సిరీస్‌ మొత్తం బద్దకస్తుడిలానే.. టీమిండియా మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!
Krishnamachari Srikkanth Comments Gambhir

Updated on: Aug 24, 2026 | 9:32 PM

Krishnamachari Srikkanth Comments on India vs Sri Lanka 2nd Test: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో టీమిండియా హవా కొనసాగుతోంది. తొలి టెస్ట్‌ను గెలిచిన భారత్‌.. రెండో టెస్టులోనూ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈక్రమంలో దేవదత్‌ పడిక్కల్‌ వరుసగా రెండో సెంచరీతో సత్తా చాటాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకుంటుంది. ఈక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక సిరీస్‌లో గంభీర్‌కు పెద్దగా పని లేకుండా పోయిదంటూ చెప్పుకొచ్చాడు. అఫ్గాన్‌, శ్రీలంకపై వరుస విజయాలతో గంభీర్‌ ఎగిరి గంతేస్తున్నట్లు తెలిపాడు. గంభీర్‌ చాలామంచి ప్లేయర్, ఆటను బాగా అర్థం చేసుకుంటాడని పొగుడుతూనే, మరోవైపు చురకలు వేశాడు. రెండో టెస్ట్ నేపథ్యంలో గంభీర్‌‌పై చేసిన వ్యాఖ్యలు గందరగోళంగా మారాయి. మాజీ దిగ్గజం మేరకు శ్రీలంక జట్టు బలంగా లేదంటూ చురకలు అంటించాడు. దీంతో సిరీస్‌ను భారత్‌ గెలుస్తుందని తేల్చిచెప్పాడు.

గంభీర్‌పై సెటైర్లు వేసిన శ్రీకాంత్‌..

శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే తొలి టెస్టును గెలిచిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ ఆధిపత్యం దిశగా సాగుతోంది. వన్‌డౌన్‌లో దేవదత్‌ పడిక్కల్‌ వరుసగా రెండో శతకంతో ఆకట్టుకోవడం జట్టుకు కలిసొచ్చింది.

సాయి సుదర్శన్‌ అందుబాటులో లేకపోయినా వన్‌డౌన్‌ స్థానంలో ఇబ్బంది కనిపించకపోవడం భారత్‌కు సానుకూల అంశంగా మారింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టు రాణిస్తోంది.

ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?

ఈ సమయంలో భారత మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ గౌతమ్‌ గంభీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శ్రీలంక సిరీస్‌లో టీమ్‌ఇండియా కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదని ఆయన వ్యాఖ్యానించాడు.

‘‘గంభీర్‌కు పనిలేదు. రెండో టెస్టుకు ముందు జట్టు కూర్పుపై అతడు ఏదో చెప్పాడు కానీ.. శ్రీలంక సిరీస్‌లో మేధోమథనం చేయాల్సినంత ఏమీ లేదు. ఎందుకంటే, లంక జట్టేమీ గొప్పగా లేదు. ఈ సిరీస్‌ను భారతే గెలుచుకుంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’’ అని శ్రీకాంత్‌ అన్నాడు.

అఫ్గానిస్థాన్‌తో పాటు శ్రీలంకపై విజయాలు సాధించిన తర్వాత గంభీర్‌ ఎగిరి గంతేస్తాడని కూడా వ్యాఖ్యానించాడు.

‘‘మొన్న అఫ్గాన్‌.. ఇప్పుడు లంకపై విజయం సాధించాక గంభీర్‌ ఎగిరి గంతేస్తాడు. ఇక్కడ నేనేదో అతడిపై పరుషంగా వ్యాఖ్యలు చేయడంలేదు. గంభీర్‌ మంచి ఆటగాడు. గేమ్‌ను బాగా చదవగల వ్యక్తి. కానీ, అతడు చెప్పాలనుకున్నదానిని ఇంకాస్త ఉత్తమంగా చెబితే బాగుంటుంది’’ అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

జట్టు కూర్పుపై గంభీర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో..

రెండో టెస్టుకు ముందు గంభీర్‌ జట్టు కూర్పు గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే శ్రీకాంత్‌ ఈ స్పందన ఇచ్చాడు. శ్రీలంక జట్టు అంత గొప్పగా లేదని, ఈ సిరీస్‌ను భారత్‌ గెలవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు.

ఎక్కువమంది చదివినది: Rishabh Pant: జస్ట్ 63.. ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటో తెలుసా..?

ప్రస్తుతం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ విభాగంలో పడిక్కల్‌ వరుస సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌లోనూ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. దీంతో గంభీర్‌ నేతృత్వంలోని భారత జట్టు సిరీస్‌పై పట్టు సాధించే దిశగా సాగుతోంది.

గంభీర్‌ను ప్రశంసించిన శ్రీకాంత్‌..

శ్రీకాంత్‌ వ్యాఖ్యల్లో గంభీర్‌పై విమర్శతో పాటు ప్రశంస కూడా కనిపించింది. గంభీర్‌ మంచి ఆటగాడని, ఆటను బాగా చదవగల వ్యక్తి అని ఆయన చెప్పాడు.

అయితే గంభీర్‌ తన ఉద్దేశాన్ని చెప్పే విధానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని సూచించాడు. శ్రీకాంత్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us