SRH vs RR Highlights: హైదరాబాద్‌కు ఘోర పరాజయం.. తొలి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఓటమి..

|

Apr 02, 2023 | 7:27 PM

Sunrisers Hyderabad vs Rajasthan Royals IPL 2023 Highlights in Telugu: తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 204 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.

SRH vs RR Highlights: హైదరాబాద్‌కు ఘోర పరాజయం.. తొలి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఓటమి..
Srh Vs Rr

SRH vs RR Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జట్టు 10వ సారి 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరును కాపాడుకుంది.

హైదరాబాద్‌పై రాజస్థాన్‌కు ఇది 9వ విజయం. ఇరు జట్లు 17 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. హైదరాబాద్‌ కేవలం 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

ఉప్పల్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇరు జట్లు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్(కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), టి. నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 02 Apr 2023 07:26 PM (IST)

    రాజస్థాన్ ఘన విజయం..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జట్టు 10వ సారి 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరును కాపాడుకుంది. ఉప్పల్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 02 Apr 2023 06:51 PM (IST)

    14 ఓవర్లకు 7 వికెట్లు డౌన్..

    14 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి 34 బంతుల్లో 121 పరుగులు చేయాల్సి ఉంది.

  • 02 Apr 2023 06:31 PM (IST)

    11 ఓవర్లకు 6 వికెట్లు డౌన్..

    11 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 6 వికెట్లు కోల్పోయి 52 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 02 Apr 2023 06:13 PM (IST)

    8 ఓవర్లకు 3 వికెట్లు డౌన్..

    8 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 3 వికెట్లు కోల్పోయి కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది. మయాంక్ 23, సుందర్ 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Apr 2023 05:49 PM (IST)

    రెండు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    రెండు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 2 వికెట్లు కోల్పోయి 7 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 02 Apr 2023 05:26 PM (IST)

    హైదరాబాద్ టార్గెట్ 204

    తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 204 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.

  • 02 Apr 2023 05:03 PM (IST)

    17 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..

    17 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. శాంసన్ 50, హెట్మేయర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 02 Apr 2023 04:36 PM (IST)

    13 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..

    13 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. జైస్వాల్ 54, బట్లర్ 54 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

  • 02 Apr 2023 04:05 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    హైదరాబాద్ బౌలర్లను దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో ఫారుఖ్ రంగంలోకి దిగి ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలి వికెట్ అందించాడు. బట్లర్ 54 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు.

  • 02 Apr 2023 03:52 PM (IST)

    4 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..

    4 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం వికెట్ కోల్పోకుండా 56 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లను చీల్చి చెండాడుతూ జైస్వాల్ 30, బట్లర్ 25 పరుగులతో దాడి చేస్తున్నారు.

  • 02 Apr 2023 03:23 PM (IST)

    మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్..

    మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం దాదాపు 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

  • 02 Apr 2023 03:19 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:

    ఇంపాక్ట్ ప్లేయర్స్: కుల్దీప్ సేన్, మురుగన్ అశ్విన్.

  • 02 Apr 2023 03:19 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్..

    ఇంపాక్ట్ ప్లేయర్స్: కార్తీక్ త్యాగి, అన్మోల్‌ప్రీత్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి.

  • 02 Apr 2023 03:11 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్(కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), టి. నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ.

  • 02 Apr 2023 03:11 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.

  • 02 Apr 2023 03:05 PM (IST)

    SRH vs RR Live Score: టాస్ గెలిచిన హైదరాబాద్..

    సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 02 Apr 2023 02:01 PM (IST)

    SRH vs RR Live Score: రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్

    ఐపీఎల్ 2023 రెండో డబుల్ హెడర్ ఆదివారం జరగనుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి.

Follow us on