అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా.. కాపాడటానికి ధోని కూడా లేదు..

ఐపీఎల్ 2024లో హైదరాబాద్ వేదికగా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మ్యాచ్ ఒకటి జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించారు.

అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా.. కాపాడటానికి ధోని కూడా లేదు..
Sunrisers Hyderabad
Follow us

|

Updated on: May 04, 2024 | 12:24 PM

ఐపీఎల్ 2024లో హైదరాబాద్ వేదికగా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మ్యాచ్ ఒకటి జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించారు. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ పెర్ఫార్మన్స్ అటుంచితే.. ఓ తెలుగు కుర్రాడు తన బ్యాటింగ్, బౌలింగ్‌తో దేశం మొత్తాన్ని ఊపేశాడు. అతడు మరెవరో కాదు నితీష్ కుమార్ రెడ్డి.

ఈ వైజాగ్ కుర్రాడు రాజస్తాన్ రాయల్స్‌ బౌలర్లను మొదటి బంతి నుంచే దూకుడైన ఆటతీరుతో బెంబేలెత్తించాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు నితీష్ రెడ్డి. అనంతరం బౌలింగ్‌లో 5 ఓవర్లకు 35 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. నితీష్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. గతేడాది కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నితీష్.. బ్యాట్ ఝళిపించేందుకు అవకాశమే రాలేదు. అయితే ఈ సీజన్‌లో మాత్రం నితీష్ కుమార్ రెడ్డి విజృంభిస్తున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మనోడి సత్తాను చూసి.. బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపించాడు. దీంతో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడిన నితీష్ కుమార్ రెడ్డి. గత రంజీ ట్రోఫీలో మొత్తం 366 పరుగులు చేసి, 25 వికెట్లు తీశాడు. కాగా, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను మెచ్చుకుంటున్న మాజీ క్రికెటర్లు.. టీమిండియాకు మరో ఆల్‌రౌండర్ దొరికేశాడని.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

Latest Articles
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్