IPL 2025: ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు బీసీసీఐ షాక్.. రెండు జట్ల కెప్టెన్‌లకు జరిమానా విధింపు! ఎందుకో తెలుసా!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. శుక్రవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండు జట్ల కెప్టెన్‌లకు స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది మొదటి నేరం కావడంతో జట్టు కెప్టెన్ ప్యాట్‌ కమ్మిన్స్‌కు రూ. 12 లక్షలు, ఆర్సీబీకి ఇది రెండో నేరం కావడంతో కెప్టెన్‌ పటిదార్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించింది.

IPL 2025: ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు బీసీసీఐ షాక్.. రెండు జట్ల కెప్టెన్‌లకు జరిమానా విధింపు! ఎందుకో తెలుసా!
Rcb Vs Srh

Updated on: May 24, 2025 | 3:02 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో ఆర్సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ ఓడిపోవడంతో ఐపీఎల్‌ పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌కు చేరుకోవాలన్న ఆర్సీబీ ఆశలు అడియాలయ్యాయి. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 8 మ్యాచ్‌లలో గెలిచిన 4 మ్యాచ్‌లలో ఓటమితో ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‌కు పరిమితం అయ్యింది. ఇక సన్‌రైజర్స్‌ విషయానికొస్తే ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచ్‌లలో నెగ్గి 7 మ్యాచ్‌లలో ఓడిపోయి ప్రస్తుతం టేబుల్‌లో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఆర్సీబీ ఆప్పటికే ప్లే ఆప్స్‌కు చేరుకోగా, సన్‌రైజర్స్‌ మాత్రం ప్లే ఆప్స్‌ రేసు నుంచి తప్పుకుంది.

శుక్రవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ఇప్పటికే బాధలో ఉన్న ఆర్సీబీతో పాటు, గెలిచిన సన్‌రైజర్స్‌ జట్టుకూ బీసీసీఐ షాక్‌ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటింగ్‌ కారణంగా రెండు జట్ల కెప్టెన్స్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. అయితే ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టుకు ఇది రెండో నేరం కావడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్‌ పటిదార్‌కు రూ.24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌తో పాటు జట్టులోని మిగిలిన సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.

ఇక సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో ఇది మొదటి నేరం కావడంతో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా జితేశ్ శ‌ర్మ వ్యవహరించినప్పటికీ. రెగ్యుల‌ర్ కెప్టెన్‌కే ఫైన్ వ‌ర్తించ‌నున్న‌ట్లు స‌మాచారం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..