Cricket News: దక్షిణాఫ్రికా క్రికెటర్ మిగ్నాన్ డు ప్రీజ్ టెస్టు, వన్డే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది. మిగ్నాన్ డు ప్రీజ్ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ 32 ఏళ్ల ప్లేయర్ ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన 2022 మహిళల ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టును సెమీ-ఫైనల్‌కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుత అర్ధ సెంచరీ సాధించి చివరి బంతికి జట్టును విజయతీరాలకు చేర్చింది. క్రికెట్ సౌతాఫ్రికా విడుదల చేసిన ఒక ప్రకటనలో మిగ్నాన్ డు ప్రీజ్ మాట్లాడుతూ.. ‘నాలుగు ICC ODI ప్రపంచ కప్‌లలో ఆడే అవకాశం వచ్చింది. ఇవి నా జీవితంలో మరచిపోలేని క్షణాలు. ఇప్పుడు నేను కుటుంబంతో గడపటానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. క్రికెట్ పెద్ద ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. T20 క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది.
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ ప్రస్తుతం చాలా మంచి స్థితిలో ఉందని మిగ్నాన్ డు ప్రీజ్ అంది. రాబోయే తరానికి ఈ గేమ్‌లో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇది. తనకి సహకరించిన క్రికెట్ సౌతాఫ్రికా, టీమ్ మేనేజ్‌మెంట్, ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపింది.
మిగ్నాన్ డు ప్రీజ్ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇందులో సెంచరీ సాధించడం విశేషం. ఆమె నవంబర్ 2014లో భారత్‌తో ఈ మ్యాచ్ ఆడింది. ఆమె దక్షిణాఫ్రికా తరపున 154 ODIలు ఆడింది. ఇందులో 32.98 సగటుతో 3760 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో రెండు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు సాధించింది. ఆమె అత్యధిక స్కోరు 116 నాటౌట్. ఆమె ఇప్పటివరకు 108 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో ఏడు అర్ధ సెంచరీల సాయంతో 1750 పరుగులు చేసింది.
? STATEMENT @MdpMinx22 has announced her retirement from ODI and Test cricket
Thank You for all your contributions to raising the profile of women’s cricket in the longer formats ?
She remains available for national duty in T20Is ? #AlwaysRising pic.twitter.com/4l4pUanlcA
— Cricket South Africa (@OfficialCSA) April 7, 2022