Video: సెంచరీతో టీమిండియాకు టెన్షన్ పెంచిన 24 ఏళ్ల బ్యాటర్.. ఎందుకో తెలుసా?

|

Oct 29, 2024 | 6:58 PM

Bangladesh vs South Africa, 2nd Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చిట్టగాంగ్ టెస్టులో 24 ఏళ్ల దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. స్టబ్స్ 106 పరుగులతో టీమిండియాకు డేంజరస్ బెల్స్ మోగించాడు.

Video: సెంచరీతో టీమిండియాకు టెన్షన్ పెంచిన 24 ఏళ్ల బ్యాటర్.. ఎందుకో తెలుసా?
Tristan Stubbs Century
Follow us on

Bangladesh vs South Africa, 2nd Test: దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్ మరోసారి ఆధిపత్యం చెలాయించాడు. ఈసారి చిట్టగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్‌పై ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టబ్స్ అద్భుత సెంచరీ సాధించాడు. స్టబ్స్ కెరీర్‌లో ఇది తొలి సెంచరీ కాగా, అతను 106 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో స్టబ్స్ 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. స్టబ్స్ ఈ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే, అతని మొదటి టెస్ట్ సెంచరీ ఆసియా గడ్డపై నమోదైంది. బంగ్లాదేశ్‌లోని క్లిష్ట పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయడం నిజంగా చాలా ప్రత్యేకమైనది.

స్టబ్స్, జార్జీ అద్భుతమైన భాగస్వామ్యం..

తన సెంచరీతో పాటు, దక్షిణాఫ్రికా ఓపెనర్ టోనీ డి జార్జితో కలిసి స్టబ్స్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి 201 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను పూర్తిగా వెనక్కు నెట్టారు. వార్త రాసే వరకు జార్జి కూడా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జార్జితో కలిసి కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ జట్టుకు శుభారంభం అందించాడు. వీరిద్దరూ కలిసి 69 పరుగులు జోడించారు. అయితే, క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ఐడెన్ మార్క్రామ్ 33 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ట్రిస్టన్ సెంచరీతో టీమిండియాకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది?

ఇప్పుడు స్టబ్స్ సెంచరీ టీమిండియాకు ఎలా ముప్పు తెచ్చిందన్నదే ప్రశ్న. నిజానికి ట్రిస్టన్ స్టబ్స్ సెంచరీ తర్వాత దక్షిణాఫ్రికా చిట్టగాంగ్ టెస్టులోనూ పటిష్ట స్థితిలోకి వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా జట్టు గెలిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో స్థానం మరింత పటిష్టంగా మారుతుంది. టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో దిగజారిపోవచ్చు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..