IPL 2022: ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు షాకిచ్చిన దక్షిణాఫ్రికా.. ఆ మ్యాచులకు దూరం కానున్న 8 మంది ప్లేయర్లు..

|

Mar 08, 2022 | 3:51 PM

South Africa vs Bangladesh 2022: ఎన్రిక్ నార్కియా అన్‌ఫిట్, సిసంద మగాలా ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలం కావడంతో రబాడ, డి కాక్, మార్క్‌రామ్, మిల్లర్‌లకు దక్షిణాఫ్రికా వన్డే జట్టులో అవకాశం లభించింది.

IPL 2022: ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు షాకిచ్చిన దక్షిణాఫ్రికా.. ఆ మ్యాచులకు దూరం కానున్న 8 మంది ప్లేయర్లు..
Ipl 2022
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందు అన్ని ఫ్రాంచైజీలకు కొత్త సమస్య వచ్చి పడింది. దక్షిణాఫ్రికా(South Africa) వన్డే జట్టు ప్రకటనతో ఐపీఎల్ జట్ల కష్టాలు పెరిగాయి. దక్షిణాఫ్రికా వన్డే జట్టును మంగళవారం ప్రకటించారు. ఇందులో ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు పొందిన 8 మంది ఆటగాళ్లు ఉండడంతో, ఆయా టీంలు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాయి. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు(SA vs BAN)ను ప్రకటించారు. వన్డే జట్టు కమాండ్ బావుమా చేతిలో ఉంది. ఈ జట్టులో క్వింటన్ డి కాక్, మార్కో యాన్సన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, రాసి వాన్ డెర్ డుసాన్ కూడా చోటు దక్కించుకున్నారు. ఈ ఆటగాళ్లందరూ ఐపీఎల్ జట్లలో భాగంగా ఉన్నారు.

బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ మార్చి 18 నుంచి ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్ మార్చి 23 వరకు జరగనుంది. అదే సమయంలో, ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభంకానుంది. ఇటువంటి పరిస్థితిలో రబాడ, డికాక్ వంటి ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆడలేకపోవచ్చు.

జాతీయ జట్టు కోసం వన్డే సిరీస్‌లో ఆడాలనుకుంటున్నారా లేదా ఐపీఎల్‌లో భాగమవుతారా అనే నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆటగాళ్లకే వదిలేసింది. వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ కూడా జాతీయ జట్టుకు ఆడాలని ఆటగాళ్లను కోరాడు.

బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు – టెంబా బావుమా, కేశవ్ మహరాజ్, క్వింటన్ డి కాక్, హంజా, మార్కో యాన్సన్, యెనెమన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, టాగిసో రబాహమ్, టాగిసో రబాదాసి వాన్ డెర్ దుసాన్, విరెన్.

Also Read: Virat Kohli: మటన్ రోల్‌ కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టిన విరాట్‌ కోహ్లీ.. అసలు ఏం జరిగిందంటే..

AUS vs PAK: ఆసీస్ దెబ్బకు పాక్ విలవిల.. వరుసగా రెండో ఓటమి.. ప్రపంచకప్‌లో సంక్షిష్టంగా మారిన అవకాశాలు