IND vs SA: భారత్‌తో T20I సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు భారీషాక్.. సిరీస్‌ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్..

Lungi Ngidi: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్‌లో జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 12న గ్కెబెర్హాలో, డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు రోజుల తర్వాత, రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఇది డిసెంబర్ 17 నుంచి 21 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 26 నుంచి ఈ జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి.

IND vs SA: భారత్‌తో T20I సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు భారీషాక్.. సిరీస్‌ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్..
South Africa T20i Sqaud

Updated on: Dec 09, 2023 | 7:10 AM

IND vs SA T20I Series: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య T20 సిరీస్ ప్రారంభం కావడానికి ముందు, ప్రోటీస్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎన్గిడి సిరీస్‌ మొత్తనికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక పోవడంతో లుంగీ ఎన్‌గిడిని ప్రొటీస్ జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో బ్యూరాన్ హెండ్రిక్స్ జట్టులోకి వచ్చాడు.

ఎడమ చీలమండ గాయం కారణంగా లుంగీ ఎన్‌గిడి టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కి ముందు ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాడనండంలో ఎలాంటి సందేహం లేదు.

రెండేళ్ల తర్వాత హెండ్రిక్స్‌కు అవకాశం..

లుంగీ ఎన్‌గిడి నిష్క్రమణ తర్వాత దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చిన 33 ఏళ్ల బైరాన్ హెండ్రిక్స్ రెండేళ్లకు పైగా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రానున్నాడు. అతను చివరిసారిగా జులై 2021లో ప్రోటీస్ జట్టుకు ఆడాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు ఒక టెస్టు, ఎనిమిది ODIలు, 19 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో హెండ్రిక్స్ రికార్డు సగటు అంతగా బాగోలేదు. అతను 19 మ్యాచ్‌లలో 25 బౌలింగ్ సగటుతో 25 వికెట్లు తీశాడు. అయితే, ఈ కాలంలో అతను 9.19 ఎకానమీ రేటుతో పరుగులు కూడా ఇచ్చాడు.

టీ20 సిరీస్‌లో ప్రోటీస్ బౌలింగ్ బలహీనంగా ఉండవచ్చు. భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా తన అత్యంత ముఖ్యమైన బౌలర్ కగిసో రబడకు కూడా విశ్రాంతినిచ్చింది. ఇప్పుడు లుంగీ ఎన్‌గిడి అవుట్ అయిన తర్వాత, ప్రోటీస్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కొద్దిగా బలహీనంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జట్టులో ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బెర్గర్, ఒట్నియల్ బార్ట్‌మన్, లిజార్డ్ విలియమ్స్‌పై ఉంది. ఈ నలుగురు ఫాస్ట్ బౌలర్లకు అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం తక్కువ.

డిసెంబర్ 10 నుంచి సిరీస్ ప్రారంభం కాగా..

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్‌లో జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 12న గ్కెబెర్హాలో, డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు రోజుల తర్వాత, రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఇది డిసెంబర్ 17 నుంచి 21 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 26 నుంచి ఈ జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..