85 సెంచరీలు.. 892 వికెట్లు.. కానీ, పొట్టిగా ఉన్నాడంటూ జట్టు నుంచి తొలగించారు.. జాతీయ గీతాన్ని పాడేందుకు ఇష్టపడని ఆ ప్లేయర్ ఎవరో తెలుసా?

|

Oct 16, 2021 | 6:15 PM

కల్లీస్ తన కెరీర్‌లో 13,289 టెస్టు పరుగులు చేశాడు. వన్డేల్లో అతని బ్యాట్ నుంచి 11,579 పరుగులు రాలాయి. బౌలింగ్ గురించి మాట్లాడితే, కల్లీస్ టెస్టుల్లో 292 వికెట్లు, వన్డేల్లో 273 వికెట్లు పడగొట్టాడు.

85 సెంచరీలు.. 892 వికెట్లు.. కానీ, పొట్టిగా ఉన్నాడంటూ జట్టు నుంచి తొలగించారు.. జాతీయ గీతాన్ని పాడేందుకు ఇష్టపడని ఆ ప్లేయర్ ఎవరో తెలుసా?
Jacques Kallis Birthday
Follow us on

చేతిలో బ్యాట్ ఉంటే పరుగుల వరదే.. అదే బాల్ ఉంటే బౌలర్లపై విధ్వంసం సృష్టించేవాడు. క్రికెట్ చరిత్రతలోని గొప్ప ఆటగాళ్లలో ఈ ఆటగాడి పేరు కూడా చేరింది. ఆయనే దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కాలిస్. ఈ దిగ్గజ ఆటగాడు బ్యాట్, బాల్‌తో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈరోజు జాక్వెస్ కల్లీస్ పుట్టినరోజు. నేటితో ఈ దిగ్గజ ఆటగాడికి 46 సంవత్సరాలు పూర్తికానున్నాయి. కల్లీస్ 16 అక్టోబర్ 1975 న కేప్ టౌన్‌లో జన్మించాడు. ఈ ఆటగాడు తన కెరీర్‌లో బ్యాట్‌తోనూ బంతితోనూ అద్భుతంగా రాణించాడు.

కల్లీస్ తన కెరీర్‌లో 13,289 టెస్టు పరుగులు చేశాడు. వన్డేల్లో అతని బ్యాట్ నుంచి 11,579 పరుగులు రాలాయి. బౌలింగ్ గురించి మాట్లాడితే, కల్లీస్ టెస్టుల్లో 292 వికెట్లు, వన్డేల్లో 273 వికెట్లు పడగొట్టాడు. కల్లిస్ బ్యాట్ నుంచి 45 టెస్ట్, 17 వన్డే సెంచరీలు నమోదయ్యాయి. జాబితా ఏ, ఫస్ట్ క్లాస్ కెరీర్‌ని జోడిస్తే, కల్లీస్ 85 సెంచరీలు సాధించాడు. అదే సమయంలో తన కెరీర్‌లో మొత్తం 892 వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఈ గణాంకాల కంటే ముందు, కల్లీస్ తన కెరీర్‌లో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. కల్లిస్ పొట్టిగా ఉన్న కారణంగా జట్టు నుంచి దూరమయ్యాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే కల్లీస్ కెరీర్ చాలా నిరాశపరిచింది. అతని కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

పొట్టిగా ఉన్నాడని జట్టు నుంచి దూరం..
జాక్వెస్ కల్లీస్ అండర్ -15 క్రికెట్ ఆడేటప్పుడు కల్లీస్ చాలా పొట్టివాడిగా ఉండేవాడు. దీంతో పశ్చిమ ప్రావిన్స్ జట్టు నుంచి తొలగించారు. చిన్నతనంలో కల్లీస్ చాలా బలహీనంగా ఉండేవాడు. కల్లీస్ ఆరోగ్యంతో ఇబ్బందిపడడంతో జట్టు నుంచి తొలగించారు. కల్లీస్‌కు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. అయితే తనను తరిమికొట్టిన వ్యక్తులకు తగిన సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

మొదటి 7 ఇన్నింగ్స్‌లో ఫ్లాప్..
తన కెరీర్ అంతటా స్థిరంగా స్కోర్ చేసిన జాక్వెస్ కల్లీస్ అంతర్జాతీయ కెరీర్ చాలా నిరాశపరిచింది. మొదటి 7 ఇన్నింగ్స్‌లలో, కల్లీస్ ఒక్కసారి మాత్రమే 10 పది పరుగులు సాధించాడు. మొదటి 7 ఇన్నింగ్స్‌లలో 8.14
సగటుతో 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, ఆ తర్వాత అతని కెరీర్ రాకెట్‌లా ఎగరడం ప్రారంభించింది. దీంతో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

స్పిన్ పిచ్‌లపై అద్భుతమైన రికార్డు..
జాక్వెస్ కల్లీస్ దక్షిణాఫ్రికాకు చెందినవాడే కావచ్చు. అక్కడ ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించేవారు. కల్లీస్ పేస్, బౌన్స్ ఆడటానికి ఇష్టపడ్డాడు. కానీ, ఈ ఆటగాడు స్పిన్నర్‌లపై మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. కల్లిస్ ఆసియాలో ఆడిన 25 టెస్టు మ్యాచ్‌లలో 55.62 సగటుతో 2058 పరుగులు సాధించాడు.

మానసికంగా బలంతోనే తగిన సమాధానం
జాక్వెస్ కల్లీస్ చాలా మానసికంగా బలమైన క్రికెటర్. కల్లిస్‌పై స్లెడ్జింగ్ ప్రభావం చూపలేదు. ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మైఖేల్ కాస్‌ప్రొవిట్జ్ అతడిని చాలాసార్లు దూషించి, స్లెడ్జ్ చేశాడు. కానీ, కల్లిస్ అతన్ని పూర్తిగా పట్టించుకోలేదు.

కల్లిస్ మైదానంలో జాతీయ గీతాన్ని పాడలేదు
జాక్వెస్ కల్లీస్ తన కెరీర్‌లో దక్షిణాఫ్రికా జాతీయ గీతాన్ని పాడలేదు. మ్యాచ్‌కు ముందు అతను జాతీయ గీతాన్ని ఆలపించడం ఎప్పుడూ కనిపించలేదు. ఇది ఎంతో పెద్ద వివాదానికి కారణమైంది. కల్లీస్ మాత్రం దీనికి కారణం చెప్పలేదు. కానీ, అతని సన్నిహితులు మాత్రం కల్లీస్ జాతీయ గీతాన్ని గౌరవిస్తారని, దక్షిణాఫ్రికా దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నారని తెలిపారు.

Also Read: IPL 2022: సరికొత్త జోష్‌తో రానున్న ఐపీఎల్ 2022.. మరో రెండు టీంల రాకతో మారనున్న లీగ్ స్వరూపం..! అన్ని జట్లలో భారీ మార్పులు?

Watch Video: రణ్‌వీర్‌ సింగ్‌లా మారిన టీమిండియా మాజీ దిగ్గజం.. స్లెడ్జింగ్‌లోనూ సరికొత్త స్టైల్‌తో నెట్టింట్లో సందడి.. వైరలవుతోన్న వీడియో