7వ స్థానంలో వచ్చి 7 సిక్సర్లు.. 71 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన ముంబై బ్యాటర్.. ఎవరంటే?

బేబీ ఏబీగా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్‌ తన అద్భుతమైన ఆటతీరుతో మరోసారి అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంక-ఏతో జరిగిన వన్డే మ్యాచ్‌లో..

7వ స్థానంలో వచ్చి 7 సిక్సర్లు.. 71 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన ముంబై బ్యాటర్.. ఎవరంటే?
Mi Batter

Updated on: Jun 05, 2023 | 8:29 PM

బేబీ ఏబీగా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్‌ తన అద్భుతమైన ఆటతీరుతో మరోసారి అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంక-ఏతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అతడు 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 7 సిక్సర్లు బాదాడు. మరి ఆ మ్యాచ్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

పల్లెకెలె వేదికగా శ్రీలంక-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య మొదటి అన్-అఫీషియల్ వన్డే మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా-ఏ జట్టుకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 155 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌‌మెన్లు పెవిలియన్ చేరగా.. ఆ సమయంలో బరిలోకి దిగాడు డెవాల్డ్ బ్రెవిస్‌.

మొదటి బంతి నుంచే దూకుడైన ఆటతీరును కొనసాగించిన డెవాల్డ్ బ్రెవిస్‌.. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి.. దక్షిణాఫ్రికా-ఏని విజయపధంలో నిలిపాడు. అతడు 71 బంతుల్లో అజేయంగా 98 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి 2 పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. కానీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.

కాగా, బ్రెవిస్‌ పేలుడు ఇన్నింగ్స్‌ కారణంగా శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా-ఏ విజయం సాధించింది. జట్టు లక్ష్యాన్ని చేరుకోవడంలో డెవాల్డ్ బ్రెవిస్‌కు సహచర ఆటగాడు బేర్స్ స్వాన్‌పోయెల్ మద్దతుగా నిలిచాడు. అతడు 28 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేశాడు.