IND vs SA: సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌.. 7 వికెట్లతో చెలరేగిన శార్ధుల్‌ ఠాగూర్

|

Jan 04, 2022 | 7:51 PM

IND vs SA: భారత్‌, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండోరోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 35 పరుగులతో

IND vs SA: సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌.. 7 వికెట్లతో చెలరేగిన శార్ధుల్‌ ఠాగూర్
Ind Vs Sa
Follow us on

IND vs SA: భారత్‌, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండోరోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 35 పరుగులతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా మొదటి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌, పీటర్సన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ డీల్ ఎల్గర్‌ జట్టు స్కోరు 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. కానీ కీగన్‌ పీటర్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 103 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. కానీ డస్సెన్ ఒక పరుగుకే ఔటై నిరాశపరిచాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన టెంబా బావుమా జట్టుని ముందుండి నడిపించాడు. హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్‌తో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వెరియానె 21, మార్కో జాన్సన్ 21, కేశరాజ్‌ మహారాజ్‌ 21 పరుగులతో రాణించడంతో జట్టు 229 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ ఏడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమి రెండు వికెట్లు దక్కాయి. జస్ర్పీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది. అంతకు ముందు భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

Prabhas: మునుపెన్నడూ కనిపించని పాత్రలో డార్లింగ్ ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి స్పిరిట్‌ కోసం ఇలా..

TRS vs BJP: రక్తి కడుతున్న తెలంగాణ రాజకీయం.. ఎన్నికలకు ముందు పసందుగా వ్యూహ ప్రతివ్యూహాలు

Akhilesh Yadav: శ్రీకృష్ణుడు కలలో కనిపించి చెప్పాడు.. యూపీలో రాబోయేది ఎస్పీ ప్రభుత్వమేః అఖిలేష్ యాదవ్