Smriti Mandhana: స్మృతి మంధాన సంచలన పోస్ట్.. పెళ్లి క్యాన్సిల్..? ఎంగేజ్‌మెంట్ రింగ్ మాయం

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై మరోసారి రూమర్లు మొదలయ్యాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇందులో ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకపోవడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

Smriti Mandhana: స్మృతి మంధాన సంచలన పోస్ట్.. పెళ్లి క్యాన్సిల్..? ఎంగేజ్‌మెంట్ రింగ్ మాయం
Smriti Mandhana Engaged Rin

Updated on: Dec 06, 2025 | 10:15 AM

Smriti Mandhana Marriage: టీమిండియా మహిళా బ్యాట్స్‌మెన్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లిపై గత కొద్దిరోజులుగా అనేక రూమర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. నవంబర్ 21న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో ఆమెకు ఎంగేజ్‌మెంట్ పూర్తైంది. నవంబర్ 23న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్న వీళ్లు.. న్యూఇయర్ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. మంధాన తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్మృతి మంధాన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను స్మృతి మంధాన పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..”అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు అయింది. ప్రపంచకప్ సమయంలో మేము ప్రతీసారి హృదయవిదారకాన్ని ఎదుర్కొన్నాం. అది ఎప్పుడో వస్తుందని మేము భావించాం. చివరికి ఆ క్షణం వచ్చినప్పుడు నేను మళ్లీ చిన్నపిల్లవాడిని అయ్యానని నాకు అనిపించింది.. మ్యాచ్ సమయంలో నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అది జట్టుకు అవసరమైన దాని గురించి మాత్రమే ఆలోచిస్తా.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అన్నీ దేవుళ్లను గుర్తుచేసుకుంటూ ప్రతీ వికెట్ పొందాలని ప్రార్ధిస్తా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచకప్ విజయం తర్వాత తొలిసారి స్మృతి మంధాన ఈ వీడియో పోస్ట్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఈ వీడియోలో స్మృతి మంధాన చేతికి నిశ్చితార్ధం రింగ్ కనిపించకపోవడానికి నెటిజన్లు గుర్తించారు. అంతేకాకుండా వివాహానికి సంబంధించి అన్ని పోస్టులను ఆమె సోషల్ మీడియా నుంచి తొలగించింది. దీంతో ఆమె పెళ్లిపై మళ్లీ పుకార్లు హల్ చల్ చేస్తు్న్నాయి. పెళ్లి ఏమైనా క్యాన్సిల్ అయిందా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండు కుటుంబాల సభ్యులు అనారోగ్యం కారణంగా వాయిదా పడినట్లు చెబుతున్నారు. పలాష్ తల్లి అమిత మాట్లాడుతూ..” త్వరలోనే వివాహం జరుగుతందని అన్నారు. వధువుతో కలిసి ఇంటికి రావాలని పలాష్ కలలు కన్నాడు. నేను ప్రత్యేకంగా కోడలికి స్వాగతం పలికేందుకు ప్లాన్ కూడా చేశాం. అంతా బాగానే ఉంది. రెండు కుటుంబాలు చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటుననాయి. ఈ కాలంలో మేము సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నాం” అంటూ ఆమె పేర్కొన్నారు.