Smriti Mandhana : స్మృతి మంధానా పెళ్లి వాయిదా..పలాష్‎ను అన్ ఫాలో చేస్తున్న ఆమె ఫ్రెండ్స్..కారణం ఏదో పెద్దదే

భారత క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి కొద్ది సమయం ముందు ఆమె తండ్రికి అకస్మాత్తుగా ఆరోగ్యం బాలేకపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఈ వివాహ వేడుకను వాయిదా వేశారు.

Smriti Mandhana : స్మృతి మంధానా పెళ్లి వాయిదా..పలాష్‎ను అన్ ఫాలో చేస్తున్న ఆమె ఫ్రెండ్స్..కారణం ఏదో పెద్దదే
Smriti Mandhana Wedding Postponed

Updated on: Nov 26, 2025 | 7:30 AM

Smriti Mandhana : భారత క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి కొద్ది సమయం ముందు ఆమె తండ్రికి అకస్మాత్తుగా ఆరోగ్యం బాలేకపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఈ వివాహ వేడుకను వాయిదా వేశారు. పెళ్లి ఆగిపోయిన కొద్ది రోజులకే పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో సాంగ్లీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

వివాహం వాయిదా పడిన తర్వాత సోషల్ మీడియాలో ఒక కొత్త విషయం చర్చనీయాంశంగా మారింది. స్మృతి మంధాన అత్యంత ఆప్తులు, భారత స్పిన్నర్ అయిన రాధా యాదవ్, పలాష్ ముచ్చల్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసినట్లు యూజర్లు చాలా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. మంధాన పెళ్లి వేడుకకు రాధా యాదవ్‌తో పాటు, జైమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ కూడా హాజరయ్యారు. అయితే రాధా యాదవ్ అన్‌ఫాలో చేసినప్పటికీ, మిగిలిన ఇద్దరు క్రికెటర్లు మాత్రం ఇంకా పలాష్‌ను ఫాలో అవుతున్నారు.

ఈ మొత్తం గందరగోళం మొదలవడానికి ముందు, స్మృతి మంధాన కూడా తన పెళ్లి వాయిదా పడిన మరుసటి రోజు ఒక అనూహ్యమైన పని చేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెళ్లికి సంబంధించిన పోస్ట్ చేసిన ఫోటోలను తొలగించారు. ఈ చర్య సోషల్ మీడియాలో మరింత అనుమానాలను పెంచింది. దీనితో ఏం జరిగింది?, పెళ్లిలో ప్రాబ్లమ్స్ వచ్చాయా? అంటూ నెటిజన్లు అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తడం మొదలుపెట్టారు.

ఈ ఊహాగానాల మధ్య పలాష్ ముచ్చల్ తల్లి అమిత్ ముచ్చల్ మీడియాతో మాట్లాడి, అసలు విషయం వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. మంధాన తండ్రి ఆరోగ్యం బాలేదని తెలియగానే, తానే ముందుగా పెళ్లి తంతును ఆపాలని పలాష్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. “పలాష్‌కి మంధాన తండ్రితో చాలా అనుబంధం ఉంది. స్మృతి కంటే కూడా వారిద్దరే చాలా క్లోజ్. అందుకే స్మృతి చెప్పకముందే పలాష్.. ఆయన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు” అని ఆమె చెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..