వార్నర్‌ కన్నా స్మిత్‌ చేసిన నేరమే పెద్దది.. బాల్ టాంపరింగ్ ఉదంతపై హాట్ కామెంట్స్ చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..

|

Jan 22, 2021 | 8:54 AM

ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కెప్టెన్సీ నుంచి

వార్నర్‌ కన్నా స్మిత్‌ చేసిన నేరమే పెద్దది.. బాల్ టాంపరింగ్ ఉదంతపై హాట్ కామెంట్స్ చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..
Follow us on

ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ టిమ్‌పైన్‌ పై వేటు పడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ హాట్ కామెంట్స్ చేశారు.

టిమ్‌పైన్‌ స్థానంలో మరొకరు దొరక్కపోతే స్టీవ్‌స్మిత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నాడు. 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో పాత్రధారి అయినప్పటికీ అతడివైపే మొగ్గు చూపొచ్చని జోస్యం చెబుతున్నాడు. ఇదే కాకుండా ఆయన మరొక ప్రశ్నను లేవనెత్తారు. నాయకత్వానికి స్మిత్‌కు అర్హత ఉన్నప్పుడు డేవిడ్‌ వార్నర్‌కు జీవితకాల నిషేధం ఎందుకు విధించారని ప్రశ్నించారు. తన దృష్టిలో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో వార్నర్‌ కన్నా స్మిత్‌ చేసిన నేరమే పెద్దదని అన్నాడు. నాయకత్వంపై స్మిత్‌కు రెండేళ్ల నిషేధం ఉంటే వార్నర్‌కూ అంతే శిక్ష ఎందుకు లేదని, సారథ్యంపై వార్నర్‌కు జీవితకాల నిషేధం విధిస్తే స్మిత్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు? 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం జరిగిన విషయం తెలిసిందే.

టీమిండియా ప్లేయర్లు రెచ్చగొట్టినా స్లెడ్జింగ్‌ జోలికి వెళ్లను: వార్నర్‌