Shahrukh khan: తన పేరు కారణంగా మైదానంలో అవహేళనలు ఎదుర్కొన్నాడు. టీం ఇండియా ప్రపంచకప్‌లో ఆడే అవకాశం కూడా దక్కలేదు. ఇప్పుడు అదే ఆటగాడు భారత క్రికెట్‌ను శాసిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇప్పుడు అందరి నోట తమిళనాడు బ్యాట్స్‌మెన్ షారుక్ ఖాన్ గురించే చర్చ జరుగుతోంది. చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. షారుక్ 15 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 33 పరుగులు చేశాడు. అయితే ఈ ఆటగాడు ఇక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా షారుక్ ఖాన్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఆటగాడిని పంజాబ్ కింగ్స్ రూ.5.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. షారుక్ ఖాన్ బేస్ ధర 20 లక్షలు మాత్రమే అయితే ఈ ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ షారుక్ ఖాన్‌ను చేర్చుకుంది.
షారుక్ ఖాన్ ఎవరు?
షారుక్ ఖాన్ మే 27, 1995న చెన్నైలో జన్మించాడు. అక్కడే క్రికెట్ నేర్చుకున్నాడు IPL కాంట్రాక్ట్ పొందాడు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పేరు మీదుగా ఇతడికి షారుక్ పేరు పెట్టారు. అయితే ఈ పేరు కారణంగా షారుక్ ఖాన్ మైదానంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రత్యర్థి జట్లు తన పేరు చెప్పి ఆటపట్టించేవారని షారుక్ ఖాన్ చెప్పాడు.
షారుక్ ఖాన్ తండ్రి-తమ్ముడు కూడా క్రికెటర్లే..
షారుఖ్ ఖాన్ తండ్రి మక్సూద్ కూడా చెన్నైలో లీగ్ క్రికెట్ ఆడాడు. అతని అన్నయ్య అక్రమ్ కూడా అదే స్థాయిలో క్రికెట్ ఆడాడు. షారుక్ దీన్ని దాటి లిస్ట్ ఎ, రంజీ ట్రోఫీ, ఐపిఎల్ వరకు ఆడాడు. షారుక్ ఖాన్ 2012 సంవత్సరంలో వెలుగులోకి వచ్చాడు. ఈ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీలో అత్యుత్తమ ఆల్ రౌండర్ అవార్డును గెలుచుకున్నాడు.
అండర్-19 ప్రపంచకప్‌లో అవకాశం రాలేదు!
2014లో కూచ్ బెహార్ ట్రోఫీలో షారుక్ ఖాన్ కేవలం 8 ఇన్నింగ్స్‌ల్లో 624 పరుగులు చేశాడు. అయితే ఇంత మంచి ప్రదర్శన చేసినా అండర్-19 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇది షారుఖ్ ఖాన్‌ను చాలా నిరాశకు గురిచేసింది. కానీ 2018లోనే తమిళనాడు తరపున లిస్ట్ A అరంగేట్రం చేసాడు. ఆ సమయంలో షారుక్ వయస్సు కేవలం 18 సంవత్సరాలు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షారుక్ ఖాన్ అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అయితే తదుపరి నాలుగు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.