IND vs NZ 2nd ODi: రాజ్‌కోట్‌లోనూ గిల్ మెరుపులు.. కట్‌చేస్తే.. ఆ ఒక్క తప్పుతో మరోసారి..

సెంచరీ దిశగా సాగుతున్న గిల్, దురదృష్టవశాత్తూ కైల్ జేమీసన్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ చేయబోయి మిడ్ వికెట్‌లో ఉన్న డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. 99 పరుగుల వద్ద రెండో వికెట్‌గా గిల్ వెనుదిరగడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.

IND vs NZ 2nd ODi: రాజ్‌కోట్‌లోనూ గిల్ మెరుపులు.. కట్‌చేస్తే.. ఆ ఒక్క తప్పుతో మరోసారి..
Shubman Gill

Updated on: Jan 14, 2026 | 3:18 PM

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి తన క్లాస్ చూపించాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీతో రాణించిన గిల్, అదే ఫామ్‌ను రాజ్‌కోట్‌లోనూ కొనసాగిస్తూ వరుసగా రెండో హాఫ్ సెంచరీని బాదాడు. కేవలం 53 బంతుల్లో 56 పరుగులు చేసిన గిల్, జట్టుకు బలమైన పునాది వేశాడు. కానీ, ఈ హాఫ్ సెంచరీని భారీ స్కోర్ గా మలచలేకపోయాడు. 56 పరుగులు చేసిన పెవిలియన్ చేరాడు.

గిల్ మెరుపు ఇన్నింగ్స్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.

స్ట్రైక్ రేట్: 105.66 స్ట్రైక్ రేట్‌తో గిల్ వేగంగా పరుగులు సాధించాడు.

బౌండరీల వర్షం: తన ఇన్నింగ్స్‌లో 7 అద్భుతమైన ఫోర్లు, 1 భారీ సిక్సర్‌తో గిల్ రాజ్‌కోట్ ప్రేక్షకులను అలరించారు.

వరుసగా రెండో ఫిఫ్టీ: ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది వరుసగా రెండో అర్ధ సెంచరీ. గత ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో గిల్‌కు ఇది అద్భుతమైన పునరాగమనం అని చెప్పవచ్చు.

సాఫ్ట్ డిస్మిసల్ – ఫ్యాన్స్ నిరాశ:

సెంచరీ దిశగా సాగుతున్న గిల్, దురదృష్టవశాత్తూ కైల్ జేమీసన్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ చేయబోయి మిడ్ వికెట్‌లో ఉన్న డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. 99 పరుగుల వద్ద రెండో వికెట్‌గా గిల్ వెనుదిరగడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అయితే, అవుట్ అయ్యేలోపే గిల్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి టీమ్ ఇండియాను పటిష్ట స్థితిలో నిలిపారు.