
Anaya bangar for Shubman Gill: భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రారాజుగా పేరుగాంచితే.. శుభ్‌మాన్ గిల్ ప్రిన్స్‌గా మారిపోయాడు. చాలా వేగంగా ప్రజాదరణ పొందుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు గిల్. అయితే, శుభమన్ గిల్‌కు ప్రిన్స్ అనే బిరుదు వచ్చినట్లే, అతని గురించి కూడా చాలా చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకుంటున్నాయి. గిల్ తన ఆటతీరుతోనే కాదండోయ్.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంతో తాజాగా అనన్య బంగర్ గిల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
అనన్య బంగర్ భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె. ఆమె అండర్ ఏజ్ క్రికెట్ టోర్నమెంట్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఆడింది. అనన్య బాలుడిగా ఉన్నప్పుడు యశస్వితో కలిసి మ్యాచ్‌లు ఆడింది. అతను సంజయ్ బంగర్ కుమారుడిగా పేరుగాంచాడు. అతని పేరు ఆర్యన్. కానీ, ఇటీవల ఆమె లింగ మార్పిడి చేయించుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయింది.
అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన తర్వాత, అనన్య బంగర్ ఫిల్మిగ్యాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత క్రికెట్ జట్టులోని చాలా మంది ఆటగాళ్ల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అనన్య హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో, ఈ ప్రక్రియ సర్ఫరాజ్ ఖాన్‌తో ప్రారంభమైంది. దీనికి ప్రతిస్పందనగా అనన్య “ఫ్రెండ్” అనే హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. ఆ తరువాత యశస్వి జైస్వాల్ పేరు వచ్చింది. జైస్వాల్‌కు ఫ్రెండ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది.
ఈ క్రమంలో శుభమాన్ గిల్ వంతు వచ్చింది. గిల్ పేరు వచ్చిన వెంటనే సీన్ మారిపోయింది. అప్పుడు హ్యాష్‌ట్యాగ్ ఫ్రెండ్‌కు బదులుగా క్రికెట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది. గిల్ తర్వాత, అనన్య బంగర్ జస్ప్రీత్ బుమ్రా కోసం డిఫరెంట్ యాక్షన్ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ మాత్రం గిల్ నీకు ఫ్రెండ్ కాకపోతే, అంతకుమించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కోసం హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించమని అనన్య బంగర్‌ను కూడా కోరగా.. విరాట్ కోసం #aggression అనే హ్యాష్‌ట్యాగ్‌ను, రోహిత్ శర్మ కోసం #actualguy అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది. సూర్యకుమార్ యాదవ్ కోసం, అనన్య #ScoopShot అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది. ఇక ఇషాన్ కిషన్ కోసం, ఆమె #Under19WorldCup హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది. నితీష్ కుమార్ రెడ్డి కోసం #AllRounder అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..