Shreyas Iyer : ఫిట్‌నెస్ టెస్టులో పాసైతేనే ఎంట్రీ..రుతురాజ్, పడిక్కల్ మధ్యలో శ్రేయస్ చిక్కుకున్నాడా?

Shreyas Iyer : టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ నీలి రంగు జెర్సీ ధరించాలంటే అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సిందే. గాయం కారణంగా అతను గత రెండు నెలలుగా జట్టుకు దూరమయ్యాడు. అయ్యర్ ఇప్పుడు రీఎంట్రీ కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Shreyas Iyer : ఫిట్‌నెస్ టెస్టులో పాసైతేనే ఎంట్రీ..రుతురాజ్, పడిక్కల్ మధ్యలో శ్రేయస్ చిక్కుకున్నాడా?
Shreyas Iyer Health Update

Updated on: Jan 02, 2026 | 5:28 PM

Shreyas Iyer : టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ నీలి రంగు జెర్సీ ధరించాలంటే అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సిందే. గాయం కారణంగా గత రెండు నెలలుగా జట్టుకు దూరమైన అయ్యర్, ఇప్పుడు రీఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయాలంటే బీసీసీఐ ఒక కఠినమైన షరతు విధించింది. కేవలం బ్యాటింగ్ చేస్తే సరిపోదు, తన ఫిట్‌నెస్‌ను మైదానంలో నిరూపించుకుంటేనే అతనికి జట్టులో చోటు దక్కుతుంది.

శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎లో తన ఫిట్‌నెస్‌పై పనిచేస్తున్నాడు. ఇప్పటికే అతను బ్యాటింగ్, ఫీల్డింగ్‌కు సంబంధించిన నాలుగు సెషన్లను విజయవంతంగా పూర్తి చేశాడు. అయితే, బీసీసీఐ మెడికల్ టీమ్ అతని కోసం జనవరి 2, 5 తేదీల్లో మ్యాచ్ సిమ్యులేషన్ సెషన్లను నిర్వహించనుంది. అంటే, నిజమైన మ్యాచ్ వాతావరణంలో అయ్యర్ శరీరం ఎలా స్పందిస్తుందో చూసి, అప్పుడే అతనికి రిటర్న్ టు ప్లే సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ ఈ రెండు సెషన్లలో అయ్యర్ విఫలమైతే, కివీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం కాక తప్పదు.

అసలు అయ్యర్‌కు ఏమైందంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ సమయంలో ఒక క్యాచ్ పట్టుకోవడానికి అయ్యర్ డైవ్ చేశాడు. ఆ సమయంలో అతని పొత్తికడుపు లోపల ఉండే స్లీన్‎కు తీవ్రమైన గాయమైంది. దీనివల్ల లోపల బ్లీడింగ్ కూడా జరిగింది. ఈ గాయం కారణంగా అయ్యర్ సుమారు 6 కిలోల బరువు తగ్గాడు. అతని కండరాల పటుత్వం కూడా క్షీణించింది. అందుకే, కేవలం గాయం నయమైతే సరిపోదు, పాత బలాన్ని పుంజుకుంటేనే అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోగలడని వైద్యులు భావిస్తున్నారు.

న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ జనవరి 3న సమావేశం కానుంది. అయ్యర్ మొదటి సిమ్యులేషన్ టెస్ట్ జనవరి 2న జరుగుతుంది కాబట్టి, దాని ఫలితాన్ని బట్టి సెలక్టర్లు ఒక నిర్ణయానికి రావచ్చు. ఒకవేళ అయ్యర్ ఫిట్‌గా లేడని తేలితే, అతని స్థానంలో కర్ణాటక రన్ మెషిన్ దేవదత్ పడిక్కల్ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. పడిక్కల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు బాది భీకర ఫామ్‌లో ఉన్నాడు. అయ్యర్ గైర్హాజరీలో పడిక్కల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.

ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ నిరూపించుకుని జట్టులోకి వస్తే, అది రుతురాజ్ గైక్వాడ్‌కు ఇబ్బందిగా మారవచ్చు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో అయ్యర్ లేని సమయంలో గైక్వాడ్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అయ్యర్ తిరిగి వస్తే, సీనియారిటీ కోటాలో అయ్యర్‌కే ప్రాధాన్యత దక్కుతుంది, దీంతో గైక్వాడ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుంది. అయ్యర్ కెరీర్‌కు ఈ సిరీస్ చాలా కీలకం, ఎందుకంటే ఫిబ్రవరిలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు సంపాదించాలంటే ఈ వన్డే సిరీస్ ప్రదర్శన అతనికి ప్లస్ అవుతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..