WTC Final 2023: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..

Shreyas Iyer Injury: ఐపీఎల్-2023 మధ్య భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ దూరమయ్యాడు.

WTC Final 2023: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
Team India

Updated on: Apr 04, 2023 | 7:14 PM

ఐపీఎల్-2023 మధ్య భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్‌ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతను ఆస్ట్రేలియాతో ఫైనల్‌లో ఆడడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అయ్యర్ గాయపడ్డాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో వెబ్‌సైట్ తన నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది.

గాయం కారణంగా అయ్యర్ IPL-2023లో ఆడలేడని పేర్కొంది. IPL మధ్యలో అయ్యర్ తిరిగి రావచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతను IPL ప్రస్తుత సీజన్ నుంచి కూడా తప్పుకున్నాడు. కోల్‌కతా గతేడాది అతడిని కొనుగోలు చేసి కెప్టెన్‌గా కూడా నియమించింది. ఈ సీజన్‌లో అయ్యర్ స్థానంలో నితీష్ రాణా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

శస్త్ర చికిత్స కోసం విదేశాలకు..

శస్త్రచికిత్స కోసం అయ్యర్ విదేశాలకు వెళ్లనున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయ్యర్ మూడు నెలలు ఆటకు దూరంగా ఉంటాడు. ఆ తరువాత అతను శిక్షణను ప్రారంభిస్తాడని పేర్కొంది. ఈ గాయం కారణంగా, అయ్యర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆడలేదు. అలాగే ODI సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

ఇవి కూడా చదవండి

జట్టులో కీలక ప్లేయర్..

గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అయ్యర్ అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. అతను ఇప్పుడు భారత టెస్ట్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అందుకే అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో లేకపోవడం టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్‌లో అతని స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నితీశ్ రానా.. ఇప్పుడు ఫైనల్‌లో అయ్యర్ స్థానంలో ఎవరు ఆడతారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..