వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ముగియగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 1) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. ఈమ్యాచ్‌లో టీమిండియాలో ఒక భారీ మార్పు జరగనుంది. వరల్డ్ కప్‌లో పరుగుల వర్షం కురిపించిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న అయ్యర్ ఇప్పుడు నాలుగో, ఐదో మ్యాచ్‌లకు టీమ్‌ఇండియాతో జతకట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అయ్యర్ ఈ టీ20 సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం ఖాయం. ఎప్పుడూ మిడిలార్డర్‌లో ఆడే అయ్యర్ తిలక్ వర్మ స్థానంలో అయ్యర్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రింకూ సింగ్ కొత్త ఫినిషర్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి భారత జట్టు అతని స్థానంలో ఎలాంటి మార్పులు చేయనట్లు తెలుస్తోంది. అయ్యర్ టాప్-4లో బ్యాటింగ్ చేయాలనుకుంటే, టాప్-3లో ఒక బ్యాటర్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చు.ఈ సిరీస్‌లో భారత్‌కు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో రుతురాజ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో కిషన్ 2 అద్భుత అర్ధసెంచరీలు చేశాడు. యశస్వి కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. గైక్వాడ్-యశస్వి-కిషన్ ఈ ముగ్గురు ఆటగాళ్లు తదుపరి టీ20 ప్రపంచకప్ దృష్ట్యా టీమ్ ఇండియాకు కీలకం. కాబట్టి వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించదు. కాబట్టి తిలక్ వర్మ స్థానంలో అయ్యర్ ఆడటం దాదాపు ఖాయం. అలాగే దీపక్ చాహర్ కూడా నాలుగో టీ20లో స్థానం దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింఘోయ్, పర్దీష్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..