Abhishek Sharma : భారత్‌కు భారీ షాక్..తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ

Abhishek Sharma : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్‌తో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 వేట మొదలైంది. అయితే తొలి మ్యాచ్‌లోనే భారత అభిమానులకు మిక్సుడ్ రిజల్ట్స్ ఎదురయ్యాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం ఒక షాక్ అయితే.. యువ సంచలనం అభిషేక్ శర్మ డకౌట్ రూపంలో మరో షాక్ తగిలింది.

Abhishek Sharma : భారత్‌కు భారీ షాక్..తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ
Abhishek Sharma Duck

Updated on: Feb 07, 2026 | 7:18 PM

Abhishek Sharma : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్‌తో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 వేట మొదలైంది. అయితే తొలి మ్యాచ్‌లోనే భారత అభిమానులకు మిక్సుడ్ రిజల్ట్స్ ఎదురయ్యాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం ఒక షాక్ అయితే.. యువ సంచలనం అభిషేక్ శర్మ డకౌట్ రూపంలో మరో షాక్ తగిలింది. భారత టీ20 క్రికెట్‌లో సరికొత్త సంచలనంగా మారిన అభిషేక్ శర్మ, తన డెబ్యూ వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే తీవ్రంగా నిరాశపరిచాడు. వాంఖడే వంటి బ్యాటింగ్ పిచ్‌పై అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తే, అతను డకౌట్ అవ్వడం ఎవరూ ఊహించని పరిణామం. అలీ ఖాన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన అభిషేక్, సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో చెలరేగిపోయే అభిషేక్, అంతర్జాతీయ వేదికపై ఒత్తిడికి లోనైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ వేసిన తొలి ఓవర్‌లో నాలుగు డాట్ బాల్స్ పడటం భారత ఓపెనర్ల మీద ఒత్తిడి పెంచింది. ఇషాన్ కిషన్ ఐదో బంతికి సిక్సర్ బాది ఊరటనిచ్చినప్పటికీ, రెండో ఓవర్‌లోనే అభిషేక్ వికెట్ కోల్పోవడం భారత్‌ను కష్టాల్లో నెట్టింది.

ఒకవైపు బ్యాటింగ్‌లో వికెట్ కోల్పోగా, మరోవైపు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత్‌కు పెద్ద లోటు. వైరల్ ఫీవర్ కారణంగా బుమ్రా తప్పుకోవడంతో మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌ల మీద భారం పెరిగింది. అమెరికా జట్టు గతంలో పాకిస్థాన్‌ను ఓడించిన అనుభవం ఉండటంతో, భారత్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే భారత గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఆడతాడని అంతా భావించారు కానీ, టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపింది. ఇషాన్ మొదటి ఓవర్‌లోనే సిక్సర్ బాది తన ఫామ్‌ను చాటుకున్నాడు. కానీ ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అవ్వడం వల్ల ఇషాన్, తిలక్ వర్మల మీద ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us