Virender Sehwag: అందుకే ఐసీసీ నిషేధించింది.. పాక్ మాజీ బౌలర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

|

May 17, 2022 | 4:53 PM

తన బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆ పాకిస్తాన్ మాజీ బౌలర్‌కి కూడా తెలుసు. అతని బౌలింగ్ యాక్షన్ బాగానే ఉంటే ఐసీసీ అతడిని ఎందుకు నిషేధించిందంటూ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు.

Virender Sehwag: అందుకే ఐసీసీ నిషేధించింది.. పాక్ మాజీ బౌలర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
Virender Sehwag
Follow us on

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) తన బలమైన బ్యాటింగ్, నికార్సయిన వాక్చాతుర్యంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడనడంలో సందేహం లేదు. ఇది కాకుండా, సెహ్వాగ్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) మధ్య మైదానంలోనే కాదు వెలుపల కూడా చాలా చర్చలు జరుగుతుంటాయి. అయితే, తాజాగా షోయబ్ అక్తర్‌కు ఎసరు పెట్టేలా సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ డిస్కస్ బౌలింగ్ చేస్తాడని తనకు తెలుసని, అతని బౌలింగ్ యాక్షన్ అంతగా బాగోలేదంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. అంతా బాగుంటే ఐసీసీ ఎందుకు నిషేధించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Also Read: IPL 2022: కోహ్లీ, రోహిత్ పేలవ ఫామ్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

స్పోర్ట్స్ 18 షో ‘హోమ్ ఆఫ్ హీరోస్’లో సంజయ్ మంజ్రేకర్‌తో మాటల సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ, ‘షోయబ్ మోచేతులు వంగి ఉంటాయని, అతను డిస్కస్ బాల్ విసిరాడని తెలుసు. లేకుంటే ఐసీసీ అతడిని ఎందుకు నిషేధించింది? బ్రెట్ లీ చేయి నిటారుగా ఉండటంతో అతని బంతిని పట్టుకోవడం చాలా తేలికవుతుంది. కానీ, షోయబ్‌తో ఇలా కాదు. అతని చేయి ఎక్కడి నుంచి వస్తుందో, బంతి ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు’ అంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు చాలా కష్టమని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ‘షేన్ బాండ్ బంతి స్వింగ్ అవుతుంటుంది. దీంతో బంతి చాలా దగ్గరకు వచ్చేది. అతను ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేసినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. బ్రెట్ లీ బంతుల్ని ఎదుర్కోవడానికి నేనెప్పుడూ భయపడలేదు. కానీ, షోయబ్‌ బౌలింగ్‌లో బంతిని బౌండరీ కొడితే.. అతను ఏం చేస్తాడో తెలియదు. బీమర్‌ను విసిరొచ్చు లేదా పాదాల మీద యార్కర్‌ని విసరొచ్చు’ అంటూ సెహ్వాగ్ తెలిపాడు.

అయితే, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ ఇలా అందరూ 150-200 బంతుల్లో సెంచరీలు చేసేవారని, నేను ఇన్ని బంతుల్లో సెంచరీలు చేసి ఉంటే నన్ను ఎవరూ గుర్తుపట్టరని సెహ్వాగ్ చమత్కరించాడు. నాదైన ముద్ర వేయాలంటే వేగంగా పరుగులు చేయాలని నాకు తెలుసు. అందుకే చాలా స్పీడ్‌గా బ్యాటింగ్‌ చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై దాడులు.. 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సీబీఐ..

Watch Video: ఓడియన్ స్మిత్ దెబ్బకు పేకమేడలా కూలిన పంజాబ్ టీం.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..