
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్‌లో టీమిండియా (India national cricket team) అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ (New Zealand) ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడోసారి టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ క్రికెట్ వర్గాల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి.
ఈ విజయంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ భారత్ ఆధిపత్యం క్రికెట్‌కు హానికరమంటూ కారు కూతలు కూశాడు.
ఒక టాక్ షోలో మాట్లాడిన ఆయన భారత్‌ను “పక్కింటి ఆటలో అందరినీ ఓడించే ధనిక పిల్లవాడితో” పోల్చడం గమనార్హం. “ఒక కాలనీలో ఒక ధనిక పిల్లవాడు ఉంటాడు. అతను మిగతా పిల్లల్ని పిలిచి ‘రండి క్రికెట్ ఆడుదాం’ అని చెబుతాడు. చివరికి అతడే గెలుస్తాడు. ఇప్పుడు భారత్ అదే చేస్తున్నట్టుంది. ఇలా చేస్తూ క్రికెట్‌ను పూర్తిగా పాడుచేశారు,” అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది అభిమానులు అక్తర్ వ్యాఖ్యలను “ఆవేశపూరిత స్పందన”గా విమర్శించారు.
ఆశ్చర్యకరంగా, ఫైనల్‌కు ముందు అక్తర్ కొంచెం భిన్నంగా స్పందించాడు. భారత్ ఫేవరెట్ అయినప్పటికీ క్రికెట్ మంచికోసం న్యూజిలాండ్ (New Zealand) గెలిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!
అయితే భారత్ ప్రదర్శనను కూడా ఆయన పూర్తిగా నిరాకరించలేదు. ముఖ్యంగా భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆటగాళ్లకు ఇచ్చిన మద్దతును ప్రశంసించాడు. కష్టకాలంలో ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం విజయానికి కీలకం అని పేర్కొన్నాడు.
అక్తర్ మాత్రమే కాదు, మరో మాజీ పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir) కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లు ఒత్తిడి తీసుకురాలేకపోవడం వల్ల భారత్‌కు మ్యాచ్ పూర్తిగా అనుకూలమైందని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..