IPL 2022: రాత మారని ముంబై ఇండియన్స్.. 12 పరుగుల తేడాతో పంజాబ్‌ గెలుపు..

|

Apr 14, 2022 | 12:00 AM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(PBKS), ముంబై ఇండియన్స్(MI) మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది...

IPL 2022: రాత మారని ముంబై ఇండియన్స్.. 12 పరుగుల తేడాతో పంజాబ్‌ గెలుపు..
Dhawan
Follow us on

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(PBKS), ముంబై ఇండియన్స్(MI) మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మయాంక్‌, ధావన్‌ శుభారంభం అందించారు. నిలకడగా ఆడుతూనే ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగారు. ముఖ్యంగా మయాంక్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 52 పరుగులు చేశాడు. ధావన్‌ ( 50 బంతుల్లో 70) కూడా ధాటిగా ఆడాడు. భారీషాట్‌ ఆడే యత్నంలో 52 పరుగుల వద్ద మయాంక్‌ ఔటౌనా ధావన్‌ తన ధాటిని కొనసాగించాడు. ఆతర్వాత వచ్చిన జాని బెయిర్‌స్టో (12), లివింగ్‌ స్టోన్‌ (2) నిరాశ పర్చినా జితేశ్‌ శర్మ (15 బంతుల్లో 30 ) మెరుపులు మెరిపించాడు. షారుక్‌ (15) కూడా రాణించాడు. ముంబై బౌలర్లలో బాసిల్‌ థంపి (47/2), జస్‌ప్రీత్ బుమ్రా (28/1), జైదేవ్‌ ఉనాద్కత్‌ (44/1) రాణించారు. మురుగన్‌ అశ్విన్‌ (34/1) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దాటిగానే ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. ఇషాన్ కిషన్‌ నమ్మెదిగా ఆడాగా రోహిత్‌ శర్మ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లో 28(3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసిన రోహిత్ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ వెంటనే 6 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ పెవిలియన్‌ చేరాడు. 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టును తిలక్ వర్మ, డెవల్డ్ బ్రేవిస్‌ ఆదుకున్నారు. సిక్స్‌లు, ఫోర్లతో స్కోర్‌ బోర్డును పరుగులు పెటించారు. 25 బంతుల్లో 49(4 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు చేసిన బ్రేబిస్‌ ఓడియనన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. సూర్యాకుమార్ యాదవ్, తిలక్ వర్మ భాగస్వామ్యం నెలకోల్పుతున్న సమయంలో తిలక్‌ వర్మ రనౌట్ అయ్యాడు. తిలక్ వర్మ 20 బంతుల్లో 36(3 ఫోర్లు, 2 సిక్స్)
పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన పోలార్డ్ సూర్యాకుమార్ యాదవ్‌తో మిస్‌ కమ్యునికేషన్‌ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యాకుమార్‌ యాదవ్‌ దాటిగా ఆడే ప్రయత్నం పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఉనత్కద్, బుమ్రా, మిల్స్ వెంటవెంటనే ఔటయ్యారు. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 చేసింది. పంజాబ్‌ బౌలర్లలో ఒడియన్ స్మిత్ 4 వికెట్లు తీయగా.. రబడ రెండు వికెట్లు, ఆరోరా ఒక వికెట్ పడగొట్టాడు.

Read Also.. ICC T20 Rankings: టీ20 ర్యాకింగ్స్‌ విడుదల చేసిన ఐసీసీ.. టాప్‌-10 బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్‌కు చోటు..